Health

డెంగ్యూ జ్వరంతో బాధ పడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే తగ్గిపోతుంది.

డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల కలిగే వ్యాధి. లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత మూడు నుండి పద్నాలుగు రోజుల తరువాత ప్రారంభమవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడటానికి సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు పడుతుంది. తక్కువ సంఖ్య కేసులలో, ఈ వ్యాధి తీవ్రమైన డెంగ్యూగా అభివృద్ధి చెందుతుంది, దీనిని డెంగ్యూ హెమరేజిక్ జ్వరం అని కూడా పిలుస్తారు.

అయితే వానా కాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వానా కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి డెంగ్యూ మొదలు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్కువగా డెంగ్యూ బారిన పడుతుంటారు. డెంగ్యూ జ్వరం ఉన్నట్లయితే కచ్చితంగా వీటిని అనుసరించాలి ఇలా చేయడం వలన డెంగ్యూ నుండి బయటపడొచ్చు. కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలు మనకి బాగా ఉపయోగపడతాయి.

వీటితో సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది. డెంగ్యూ వారం రోజులు ఉండి.. ఆ తరవాత తగ్గిపోతుంది ఈ టైం లో బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి వాటిని పెంచి టాక్సిన్స్ ని బయటికి పంపడం చాలా మంచిది. ఆయుర్వేదంలో డెంగ్యూ కి అనేక ఔషధాలు ఉన్నాయి. ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఉసిరిని తీసుకోవడం మంచిది.

బొప్పాయి ఆకుల్ని జ్యూస్ చేసుకుని తీసుకోవడం వలన సమస్య తగ్గుతుంది. ప్లేట్లెట్స్ ని పెంచుకోవచ్చు. తులసిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి కాబట్టి తులసిని కూడా మీరు తీసుకోవచ్చు తులసి ఆకుల్ని నేరుగా తీసుకోవచ్చు. లేదంటే మీరు తులసి టీ తీసుకోవచ్చు. వేప ఆకులని తీసుకుంటే కూడా ఈ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు వేపాకు కషాయాన్ని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

చెడు పదార్థాలు బయటకు వెళ్తాయి అతిమధురం తీసుకోవడం వలన కూడా ఈ సమస్య నుండి బయట పడొచ్చు. అయితే డెంగ్యూ వచ్చిందని కేవలం వీటిని మాత్రమే తీసుకుంటే సరిపోదు డాక్టర్ సలహాను కూడా తీసుకోవడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker