News

తాను చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన డేనియల్‌ బాలాజీ.

బాలాజీ అకాల మరణం పట్ల సినీ ప్రపంచంలో సంతాపం తెలుపుతుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు డేనియల్ బాలాజీ. బుల్లితెరపై హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన బాలాజీ.. సినిమాల్లో మాత్రం ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు. ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అయితే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు శరీరంలో ఉన్న ప్రధానమైన అవయవాలు అనగా.. కళ్లు, కీడ్నీలను దానర్థం చేస్తారన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే.. డేనియల్‌ బాలాజీ కూడా తాను మరణించినప్పుడు తన నేత్రాలను దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కాగా, ఆయన చనిపోతూ మరో ఇద్దరికి చూపును ఇవ్వలనది తన ఆశయం. అందుకు తగ్గాట్టుగానే.. ఐ రిజిస్టర్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అలాగే కుటుంబ సభ్యులతో అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు.

ఇక ఊహించని విధంగా సడెన్ గా బాలాజీ మరణించడంతో.. ముందుగానే ఆయన అనుకున్న కలని సహాకరం కుటుంబ సభ్యులు సహాకారం చేశారు. కాగా, డేనియల్‌ బాలాజీ మరణం తర్వాత.. ఆయన కళ్లను చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి వారు సేకరించి భద్రపరిచారు. అలాగే చూపులేని మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇక డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేసేందుకు సంబంధించిన ఆపరేషన్‌ పూర్తి అయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతరం ఆయన భౌతికాయన్ని తిరువాన్మియూర్‌లోని తన స్వగృహానికి తరలించనున్నారు. కాగా, రేపు ఆయన నివాసంలోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. తాను సజీవంగా లేకపోయినా.. మరో ఇద్దరికి తన కళ్లను దానం చేసిన మంచి హృదయం డేనియల్ బాలాజీది అని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker