Health

షుగర్‌ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..? వైద్యులు ఏం చెప్పారంటే..?

కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే అపోహలో ఉంటారు. కానీ, కొబ్బరి నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గంచడంలో సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని అధిక లవణాలను తొలగిస్తాయి. కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే వేసవి తాపాన్ని పోగొట్టడంలో కొబ్బరి నీళ్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. ఇవి శరీరానికి చలువ చేయడంతోపాటు తక్షణ శక్తిని కూడా ఇస్తాయి.

నిజానికి.. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా నీరు అవసరం. అలాగని కేవలం నీళ్లతో మాత్రమే సరిపెట్టుకుంటే పోషకాలు అందేదెలా? సహజసిద్ధమైన పోషకాలు అందించే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారికి కొబ్బరి నీళ్ల వల్ల నొప్పి ఎక్కువ కాకుండా ఉంటుంది. గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగితే తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో లాభం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కొబ్బరి నీళ్లలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేస్తాయి. గ్లాసుడు కొబ్బరి నీళ్లలో 9 శాతం ఫైబర్‌ ఉంటుంది. ఎప్పుడైనా కడుపులో మంటగా అనిపిస్తే ఓ గ్లాసు కొబ్బరి నీళ్లు తాగేస్తేసరి.. తక్షణ ఉపశమనం కలుగుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. తరచూ ఈ కొబ్బరి నీళ్లు తాగటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఇందులో చక్కెర శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ మధుమేహం ఉన్నవారు ఈ నీళ్లను తాగొచ్చా? లేదా అనే సందేహం చాలా మందిలో మెదులుతుంది. ప్రముఖ న్యూట్రీషనిస్ట్‌ ధరణి కృష్ణన్‌ ఏమంటున్నారంటే.. సాధారణంగా అన్ని వయసుల వారు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. షుగర్ పేషెంట్లు కూడా కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఐతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముదిరిన కొబ్బరి కాయ లేదా కొబ్బరి పట్టిన కొబ్బరి కాయల నీళ్లు తాగకూడదు.

ఎందుకంటే వీటి నీళ్లు చాలా తియ్యగా ఉంటాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. లేత కొబ్బరి కాయ నీళ్లు షుగర్‌ పేషెంట్లు తాగవచ్చు. ఎందుకంటే లేత కొబ్బరి కాయ అంటే పక్వానికి రాని కొబ్బరి కాయ నీళ్లు రుచికి కొద్దిగా ఉప్పగా ఉంటాయి. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ కొబ్బరి పట్టిన కొబ్బరి కాయ నీళ్లు మాత్రం తాగకూడదని సూచించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker