News

ఒకప్పుడు చెత్త ఏరుకుంది. పట్టుదలతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

దివ్యాంకా త్రిపాఠి..భోపాల్ లో ఆకాశవాణిలో నటిగా కెరీర్ ను ప్రారంభించింది. 2003లో జరిగిన ప్యాంటీన్ జీ టీన్ క్వీన్ పోటీల్లో మిస్ బ్యూటిఫుల్ స్కిన్ టైటిల్ గెలుచుకుంది. 2004లో ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కీ ఖోజ్ పోటీల్లో పాల్గొన్న ఆమె భోపాల్ జోన్ కు విజేతగా నిలిచింది. 2005లో మిస్ భోపాల్ టైటిల్ గెలుచుకుంది. అయితే ఏ రంగంలోనైనా సరే, విజయం సాధించాలంటే బలమైన సంకల్పంతో కష్టపడాలి. డబ్బు, పాపులారిటీ సంపాదించడం అంత సులభమేమీ కాదు. చాలామంది చిన్న సమస్యలకే భయపడి పోయి సాదాసీదా జీవితానికి పరిమితమవుతుంటారు.

కొందరు మాత్రం ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించేవరకు వెనకడుగు వేయరు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇన్‌స్పైరింగ్‌ సెలబ్రెటీలు చాలామందే ఉన్నారు. వారిలో ఇండియన్ టీవీ యాక్ట్రెస్ దివ్యాంక త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ టీవీ ఇండస్రీలో బీభత్సమైన స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. ఈ పేరు, గుర్తింపు ఆమె దృఢత్వానికి, సంకల్పానికి నిదర్శనం. ఆమె ప్రయాణం పూలపాన్పు కాదు. జీవితంలో ఆమెకు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. వాటన్నిటినీ తట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ నేడు హైయ్యెస్ట్ పెయిడ్ టీవీ యాక్ట్రెసెస్‌లో ఒకరిగా ఎదిగింది.


జీవిత ప్రయాణం.. ఒకప్పుడు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఈ అందాల తార ఇప్పుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఇటీవల “బాలీవుడ్ బబుల్” వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సక్సెస్‌కి ముందు పడిన బాధల గురించి వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఇన్‌స్పిరేషనల్ లైఫ్ జర్నీ హాట్ టాపిక్‌గా మారింది. దివ్యాంక నటించిన మొదటి సోప్ డ్రామా “బానూ మెయిన్ తేరీ దుల్హన్”. ఇందులో ఆమె ఆరేళ్లు నటించింది. ఆ హిట్ సీరియల్‌తో హిందీ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఇంకొక సీరియల్‌లో ఆమెకు ఆఫర్ రావడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది.

దివ్యాంక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పింది. ఒక షో ముగిశాక ఆర్థిక వ్యవహారాలు మేనేజ్ చేసుకోవడంలో చాలా కష్టాలను ఫేస్ చేశానని తెలిపింది. ఒక ప్రాజెక్ట్ ముగియడం అంటే ఉపాధి కోసం కొత్త పోరాటం మొదలయ్యిందని అర్థం అన్నట్లు ఆమె మాట్లాడింది. ఆ సమయంలో బిల్లులు, EMIల వంటి ఖర్చులను చెల్లించడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడిందట. ఈ కష్టాల సమయంలో డబ్బు కోసం ఏ పనినైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండేదట.

చెత్త ఏరుకోవడం ఎందుకు?: బతకడం కోసం ఎంత చిన్న పని అయినా, ఏ పాత్రకైనా తనను తాను సిద్ధం చేసుకున్నానని దివ్యాంక వివరించింది. రూ.2,000, లేదంటే రూ.5,000 ఇలా చిన్నపాటి డబ్బులు వచ్చే పనిచేయడానికైనా ఒప్పుకునేదాన్ని అని ఆమె చెప్పుకొచ్చింది. చివరికి ఖాళీ టూత్‌పేస్ట్ బాక్సులను కూడా ఏరుకున్నానని చెప్పింది. ఇలాంటి చెత్తను సేకరించి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని సేవ్ చేశానని వెల్లడించింది. ఒకానొక సమయంలో ఈ చెత్తను అమ్మడమే జీవనాధారం అయ్యిందని తెలిపింది. పెంపుడు కుక్కకు ఆహారంతో సహా నెలవారీ అవసరాలను కవర్ చేయడానికి ఆదాయాన్ని పొందడం ఆమెకు ఒక పెద్ద ఆందోళనగా ఉండేదట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker