Health

అద్భుతం చేసిన డాక్టర్లు, తెగిన బాలుడి తలను అతికించిన డాక్టర్లు.

ఇజ్రాయెల్‌ లోని డాక్టర్లు అత్యంత అసాధారణ,సంక్లిష్టమైన సర్జరీ నిర్వహించారు. తెగిపోయిన బాలుడి తలను అతికించి ప్రపంచాన్ని నివ్వెరపర్చారు. ఈ ఏడాది జూన్ నెలలో సులేమాన్ హసన్ అనే 12 ఏళ్ల పాలస్తీనా బాలుడు సైకిల్‌పై వెళుతున్నప్పుడు ఓ కారు స్పీడ్ గా వచ్చి అతడి సైకిల్ ని ఢీకొట్టింది. భయంకరమైన కారు ప్రమాదంలో బాలుడి తల అంతర్గతంగా శిరచ్ఛేదం అయింది.

వివరాళ్లోకి వెళ్తే… జోర్డాన్ వ్యాలీకి చెందిన పన్నెండేళ్ల సులేమాన్ హసన్ కు రోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే తప్పనిసరిగా సైకిల్ పై చక్కర్లు కొట్టడం అలవాటట. ఇందులో భాగంగానే ఓ రోజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన హసన్ ను కారు ఢీకొట్టిందట. దీంతో తీవ్ర గాయాలు పాలయిన హసన్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారట.

అయితే హసన్ ను ఆస్పత్రికి తరలించే సమయానికి… హసన్ మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యి ఉండటంతోపాటు… తల శరీరం దాదాపు ఒకదాన్నుంచి మరోటి వేరైన స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. శిరస్సుతో వెన్నెముక చివరి అంచును కలిపి ఉంచే భాగం దాదాపు విడిపోయిందట. ఇదే సమయంలో పొత్తి కడుపులో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారంట.

దీంతో హసన్ కే సును జెరూసలేంలోని హదస్సా ఈన్ కెరెమ్ ఆస్పత్రి వైద్యులు ఓ సవాలుగా స్వీకరించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఆస్పత్రిలోని అన్ని విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు కొన్ని గంటలపాటు శ్రమించారని తెలుస్తుంది. ఈ ఆపరేషన్ లో ముందుగా… తల మెడ కలిసే చోటులోని పూర్తిగా దెబ్బతిన్న లిగ్మెంట్లును పరిశీలించారట. అనంతరం శస్త్రచికిత్స ద్వారా తల వెన్నెముకను తిరిగి కలిపారని అంటున్నారు.

అయితే ఈ విషయాలపై స్పందించిన వైద్యులు… ప్రమాదం జరిగిన వెంటనే ట్రామా సిబ్బంది సత్వరం స్పందించి ప్రాథమిక చికిత్స అందించడం నుంచి.. ఆపరేషన్ చేయడం వరకూ ప్రతి నిర్ణయం హసన్ ప్రాణాల్ని నిలబెట్టేందుకు తోడ్పడిందని.. తమ క్లిష్టమైన తీవ్ర ప్రయత్నం వృథా కాలేదని.. ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారని అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker