Health

కాల్చిన మొక్కజొన్నలు తింటే క్యాన్సర్‌ వస్తుంది. సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.

మొక్కజొన్న కంకుల‌ను మ‌నం వివిధ రూపాల‌లో ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. మొక్క‌జొన్న కంకుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. మొక్క‌జొన్న పిండితో కూడా మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అయితే మొక్కజొన్న కంకులను టైమ్‌పాస్‌కు చాలా మంది తింటుంటారు. వీటిని కాల్చుకోని ఉడకపెట్టుకోని మనకు ఇష్టం వచ్చినట్లు తింటాం. ఇందులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.

కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డంలో, మ‌ల‌బద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో, క్యాన్స‌ర్ వ్యాధి బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మొక్క‌జొన్న కంకులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. కాల్చి తీసుకున్న మొక్క‌జొన్న కంకులు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న ఎక్కువ‌గా ఈ కాల్చిన కంకులు ల‌భిస్తాయి. అయితే కాల్చిన మొక్క‌జొన్న కంకులే రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

చైనా దేశ శాస్త్ర‌వేత్త‌లు 405 మంది పిల్ల‌ల‌పై జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను వ‌రుస‌గా 16 రోజుల పాటు పిల్ల‌లకు ఇచ్చి ప‌ప‌రిశోధ‌నలు జ‌రిపారు. ఇలా కాల్చిన మొక్క‌జొన్న కంకుల‌ను తీసుకోవ‌డం వల్ల దంతాల‌పై ఉండే ఎనామిల్ దెబ్బ‌తింటుంద‌ని నిపుణులు గుర్తించారు. కంకుల‌ను కాల్చ‌డం వ‌ల్ల వాటి నుంచి ఫ్లోరిన్ ఎక్కువ‌గా విడుద‌ల అవుతుంద‌ని దీంతో అది దంతాల‌పై ఉండే ఎనామిల్ ను దెబ్బ‌తీస్తుంద‌ని నిపుణులు తెలియ‌జేసారు. న‌ల్ల‌గా కాల్చిన కంకుల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోకి కార్బ‌న్ ఎక్కువ‌గా ప్ర‌వేశిస్తుంది.

దీంతో శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి మంచి కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అంతేకాకుండా శరీరంలో క్యాన్స‌ర్ క‌ణాలుగా కూడా మారే అవ‌కాశం ఉంది. అలాగే శ‌రీరంలో ఫ్రీరాడికల్స్ స్థాయిలు ఎక్కువ‌య్యి క్యాన్స‌ర్‌తో పాటు వివిధ ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంది. కాల్చిన కంకుల‌ను తిన‌డం వ‌ల్ల వాటిపై ఉండే మాడు కార‌ణంగా జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తే అవకాశం కూడా ఉంది. కంకుల‌ను కాల్చి తీసుకోకూడదు. వీలైనంత వ‌ర‌కు ఉడికించి తీసుకోవాలి. ఉడికించిన కంకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఎలాంటి హానీ ఉండదు. కాల్చ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కంకులే అనారోగ్యానికి దారి తీస్తాయి. త‌రుచూ కాకుండా ఎప్పుడోక‌ప్పుడు మాత్ర‌మే కంకుల‌ను కాల్చి తీసుకోవాలి. అది కూడా మ‌రీ న‌ల్ల‌గా కాల్చి తీసుకోకూడ‌దు.అలాగే కంకుల‌ను కాల్చేట‌ప్పుడు నేరుగా బొగ్గుల‌పై కాల్చ‌కుండా వీటిపై ఉండే పొట్టును తీయ‌కుండా అలాగే కాల్చి తీసుకోవాలి. ఇలా పొట్టుతో కాల్చి తీసుకోవ‌డం వ‌ల్ల కంకుల‌ను కాల్చిన‌ప్ప‌టికి మ‌న‌కు హాని క‌ల‌గ‌కుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker