ఈ పండ్ల విత్తనాలు తింటే మీ ప్రాణాలకే ప్రమాదం. పొరపాటున కూడా తినొద్దు.

రోజూ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది వీటిని తింటారు. కానీ, మీరు కొన్ని మార్గదర్శకాలను పాటించకుండా ఆపిల్ తింటే, అది స్లో పాయిజన్‌గా మారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. యాపిల్స్‌లో కేలరీలు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, కాపర్, పొటాషియం మరియు విటమిన్ కె ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇలా తీసుకునే క్రమంలో తినకూడని గింజలను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యతో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాబట్టి ఈ పండ్లలో ఉండే విత్తనాలు తీసుకోకపోవడం చాలా మంచిది. యాపిల్ గింజలు..యాపిల్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని ఆరోగ్య నిపుణులు తరచుగా తీసుకోవాలని సూచిస్తారు. అయితే చాలా మంది యాపిల్స్ తినే క్రమంలో వాటి గింజలను కూడా తింటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ విత్తనాల నిండా విషం ఉంటుందని..వీటిని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే వీటిని తినడం వల్ల కొందరిలో ప్రాణాంతకంగానూ మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 1 కిలో 15.2 మిల్లీగ్రాములుగా విత్తనాలు తినేవారిలోనే ప్రాణాంతక సమస్యల వస్తాయట. లిచీ గింజలు..లిచీ పండ్లు శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
అయితే వీటిలో ఉండే గింజలు తీసుకోవడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లిచీ గింజలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. వీటిని మధుమేహం సమస్యలతో బాధపడేవారు తింటే ప్రాణాంతకంగా మరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మెదడులో మంట వంటి సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. టమోటో విత్తనాలు..టమోటో గింజలు చాలా చిన్నవిగా, ఎక్కువగా గుజ్జులో చుట్టుకొని ఉండడం మీరు చూడవచ్చు.
వెజిటేబుల్ లేదా సలాడ్, ప్యూరీలో తరచుగా వినియోగిస్తు ఉంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లతో పాటు జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవడం మానుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర నొప్పి కారణంగా వాపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.