Health

మంచిదని పాలు ఎక్కువగా తాగితే ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

ఒక గ్లాసు పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అందుకే వైద్యులు, పోషకాహార నిపుణులు ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగాలని సూచిస్తుంటారు. రాత్రివేళ నిద్రించే ముందు ఓ గ్లాస్‌ పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంటే ఓవరాల్ గా పాలు పరిపూర్ణ డైట్. అందుకే పిల్లలు సహా పెద్దలు కూడా రోజుకు ఒక గ్లాస్‌ పాలు తాగాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్లనే కాదు పాలను కూడా సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.

అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను తాగాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పాలు పోషకాలకు మంచి వనరు. ఈ పాలు మన శరీరానికి అవసరమైన పోషణను అందించడానికి సహాయపడతాయి. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ ఎ, ఫాస్పరస్, విటమిన్-డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పాలను తాగితే.. ఇంకొంత మంది మాత్రం నైట్ పడుకునే ముందు తాగుతారు.

అన్నింటిలాగే పాలు కూడా మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి. జీర్ణ సమస్యలు.. చాలా మందికి పాల అలెర్జీ కూడా ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని పాలను తాగితే పొట్టకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలను మరీ ఎక్కువగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే పాలను మోతాదులోనే తాగాలి. బరువు పెరగడం ..పాలు ప్రోటీన్ కు మంచి వనరు. అయితే పాలలో కూడా కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే బరువు తగ్గాలనుకునే వారు పాలను మోతాదులోనే తాగాలి. ఒకవేళ పాలను ఎక్కువగా తాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా బాగా పెరుగుతారు. మొటిమల సమస్య.. పాలను ఎక్కువగా తాగితే కూడా మొటిమలు అయ్యే అవకాశం ఉంది. పాలను ఎక్కువగా తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల చర్మం సున్నితంగా ఉన్నవారికి మొటిమలు అయ్యే అవకాశం ఉంది.

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం.. అవసరానికి మించి పాలను మరీ ఎక్కువగా తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే పాలను మోతాదుకు మించి అస్సలు తాగకండి. కొవ్వు కాలేయం.. మీకు కొవ్వు కాలేయం సమస్య ఉన్నట్టైతే మీరు పాలను మొత్తమే తాగడం మానుకోవాలి. ఎందుకంటే పాలలో ఉండే కొవ్వు కాలేయంలో వాపు సమస్యను పెంచుతుంది. అందుకే మీరు పాలను కొన్ని కూడా తాగకూడదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker