Health

జ్వరం వచ్చిన, తలనొప్పి వచ్చినా పారాసిటమాల్ వేసుకుంటున్నారా..! ఎంత ప్రమాదమంటే..?

చాలామంది జ్వరం వచ్చిన, తలనొప్పి వచ్చిన బాడీ పెయిన్స్ ఉన్నా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా పారాసిటమాల్ కలిగిన మాత్రలు కానీ,సిరప్ లు కానీ వేసుకుంటూ ఉన్నారు.ఒక మోతాదు వరకు పారాసిటమాల్ మన శరీరానికి లాభాలను కలిగించినా,మోతాదు మించితే మాత్రం చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే శరీరంలో రోగ నిరోధక శక్తి వీక్ అయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సీజన్లు మారినప్పుడల్లా కూడా జ్వరం అనేది కామన్ గా ఎవ్వరికైనా వస్తుంది.

ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా చాలా మంది వెంటనే పారాసిటమాటల్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటున్నారు. అలాగే చిన్న పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్ వల్ల కేవంల జ్వరం మాత్రమే కాకుండా ఫ్లూ, తల నొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి ఉన్నా కాస్త తగ్గుతాయి. జ్వరం, తల నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గరకు వెళ్లినా పారాసిటమాలే ఇస్తారు. ఈ విషయం తెలిసిన చాలా మంది.. వైద్యుల్ని సంప్రదించకుండానే.. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వేసేసుకుంటారు.

కానీ ఇలా డాక్టర్ని సంప్రదించకుండా.. డోసేజ్ ఏంటో తెలీకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ని ఎక్కువగా తీసుకోవడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. అంతే కాకుండా శరీరంలోని అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. రక్త హీనత.. పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది తగ్గి పోతుందట. దీంతో రక్త హీనతకు దారి తీస్తుంది. అంతే కాకుండా బలహీనమవుతారని నిపుణులు చెబుతున్నారు.

కాలేయం దెబ్బతింటుంది..చాలా మంది చేసే తప్పులు ఏంటంటే.. కేవలం పారాసిటమాలే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే మాత్రలు అనేవి వేసుకుంటున్నారు. దీని వల్ల ముఖ్యంగా లివర్ పై ఎఫెక్ట్ పడుతుందని చాలా మందికి తెలీదు. కాలేయం దెబ్బతింటే కళ్లు, చర్మం అనేది పసుపు రంగులోకి మారి పోతాయి. మూత్రం కూడా పసుపు రంగులో మారుతుంది. కాబట్టి ట్యాబ్లెట్స్ తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి. అలర్జీ..పారాసిటమాల్ మాత్రలను ఎక్కువగా తీసుకున్నా.. కొందరిలో అలర్జీకి దారి తీస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోలేక పోవడం లక్షణాలు కనిపిస్తాయి. రక్త స్రావము..పారాసిటమాల్ మాత్రలు వేసుకోవడం వల్ల కొందరిలో తీవ్రంగా రక్త స్రావం కూడా అవుతుంది. అంతే కాకుండా ఈ ట్యాబ్లెట్ ను ఆస్పిరిన్ వంటి ఇతర మందులతో కలిపి తీసుకుంటే మాత్రం రక్త స్రావము అనేది మరింత ఎక్కువగా అవుతుంది. అంతే కాకుండా ఆకలి లేక పోవడం, చెమట ఎక్కువగా పట్టడం, వాంతులు, వికారం, తిమ్మిరి, పొత్తి కడుపు పై భాగంలో నొప్పి వంటివి కూడా ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker