Health

బీర్ తాగుతున్న వారికి ‘చేదు’ వార్త, సంచలన విషయం చెప్పిన పరిశోధకులు.

ప్రతిరోజూ మద్యం సేవించడం వల్ల చాలా చెడు దుష్ప్రభావాలు ఉంటాయి. అన్ని ఆల్కహాల్ పానీయాల మాదిరిగానే, ఎక్కువ పరిమాణంలో బీర్ తాగడం ఆరోగ్యానికి చెడుగా మారుతుంది. అధిక మోతాదులో బీర్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అదే సమయంలో, బీరును నిరంతరం తీసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, కాలేయం దెబ్బతినడం, గుండె జబ్బులు, నిరాశ ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే వాతావరణ మార్పుల ప్రభావం బీర్ రుచిని కూడా పాడు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్న అధ్యయనం అందరినీ షాక్‌ కు గురిచేస్తుంది.

బీర్ అభిరుచులకు, వాతావరణ మార్పులకు ఎక్కడ సంబంధం ఉందని ఆశ్చర్యపోతున్నారా..? అయితే, ధాన్యాలు, నీరు, ఈస్ట్, హాప్‌లు బీర్ ఉత్పత్తిలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు. హాప్ ఫ్లవర్ వివిధ రకాల బీర్ చేదు, రుచిని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గింజలు, హాప్‌లతో కలిపి బాగా ఉడికిస్తారు. అప్పుడు బీరు చేదు విడుదల అవుతుంది. అంటే బీరు రుచికి ఈ పూలు చాలా ముఖ్యం. కానీ తీవ్రమైన వాతావరణం కారణంగా ఈ పువ్వులు వాడిపోతున్నాయి.

దీని వల్ల బీర్ రుచి మారడమే కాకుండా రానున్న రోజుల్లో బీర్ ఖరీదు కూడా పెరుగుతుందని సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురితమైన అధ్యయన నివేదిక పేర్కొంది. నీరు, టీ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే డ్రింక్‌ బీర్ అని పరిశోధన మరింత హైలైట్ చేస్తుంది. సాంప్రదాయ బీర్ తయారీకి మధ్య ఐరోపాలో గొప్ప చరిత్ర ఉంది. ఇది నియోలిథిక్ కాలం 3500-3100 BC నాటిది. నీరు కాకుండా, మాల్టెడ్ బార్లీ, ఈస్ట్, హాప్స్, బీర్‌కు ప్రత్యేకమైన రుచిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అందువల్లే సాంప్రదాయ బీర్‌ల జనాదరణ పెరగడంతో, అధిక నాణ్యత, సువాసనగల హాప్‌లకు డిమాండ్ పెరుగుతుంది. కరువు పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రత ఈ పువ్వుల పెరుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఐరోపాలో సాంప్రదాయ హాప్స్ పంట 2050 నాటికి 4-18శాతం తగ్గుతుంది. అదనంగా, సుగంధ హాప్ ఆమ్లాల ఉత్పత్తి 20-31శాతం తగ్గుతుంది. 2020లో కోవిడ్-19 మహమ్మారి సంభవించినప్పటి నుండి బీర్ ధర 13శాతం పెరిగింది.

అధిక, మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతలు హాప్‌ల ఆల్ఫా బిట్టర్ యాసిడ్స్‌లో తగ్గుదలకు దారితీశాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇది బీర్‌ రుచిని ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, మానవ కార్యకలాపాల నుండి వెలువడే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదం చేస్తాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker