మద్యం సేవిస్తూ ఇవి తింటున్నారా..? ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

హౌస్ పార్టీ, బార్, పబ్ లేదా హోటల్‌లో ఆల్కహాల్‌తో పాటు అనేక ఆహార పదార్థాలు కూడా వడ్డిస్తారు అనే విషయం మీరు గమనించి ఉండాలి. ప్రజలు కూడా తింటారు. ప్రజలు తరచుగా మద్యంతో పాటు ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తారు. అయితే ఆల్కహాల్‌తో పాటు లేదా మద్యం సేవించిన తర్వాత కూడా తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని మీకు తెలుసా. దీని వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రావచ్చు.
ప్రస్తుత కాలంలో చాలామంది మద్యం తాగుతారనడంలో అతిశయోక్తి లేదు. పెద్దలతో పాటు.. యుక్త వయస్సుకు వచ్చిన వారుసైతం చాలా మంది మద్యం సేవించడం ప్రస్తుతం చూస్తునే ఉన్నాం. అయితే, మద్యం సేవించే సమయంలో మంచింగ్‌గా ఇతర ఆహార పదార్థాలను తినడం సాధారణం. జీడిపప్పు, వేరుశెనగ తినకూడదు.. సాధారణంగా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు వేరుశెనగ తినడానికి ఇష్టపడతారు.
అంతే కాదు చాలా మంది ఎండు జీడిపప్పు కూడా తింటారు. అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు ఎప్పుడూ ఈ ఫుడ్‌ని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిలో కొలెస్ట్రాల్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆల్కహాల్‌తో పాటు శరీరంలోకి వెళ్లడం ద్వారా.. శరీరంలో ఫ్యాట్ స్థాయి పెరుగుతుంది. సోడా, కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం.. మద్యాన్ని సోడా, కూల్‌డ్రింక్స్‌తో కలిపి అస్సలు సేవించకూడదు.
ఈ రెండూ శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. అందువల్ల, వాటికి బదులుగా నీళ్లు, ఐస్ కలిపిన మద్యం సేవించడం ఉత్తమం. ఫ్రై చేసిన స్నాక్స్ తినొద్దు.. మద్యం సేవించేటప్పుడు.. ఫ్రై చేసిన స్నాక్స్ అస్సలు తినొద్దు. చాలా మంది మద్యపానం చేసేటప్పుడు స్నాక్స్‌గా చిప్స్ తింటారు. అయితే, అవి ఆరోగ్యానికి హానీ తలపెడతాయని అంటున్నారు నిపుణులు. పాల ఉత్పత్తులను తినొద్దు.. సాధారణంగానే ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
అందులోనూ ఆల్కాహాల్ తాగిన తరువాత పాలు తాగితే.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాలలో ఉన్న పోషకాలేవీ శరీరానికి పూర్తిస్థాయిలో అందవు. అయితే, తక్కువ మోతాదులో మద్యం తాగితే మాత్రం పాలు తాగొచ్చు. స్వీట్లు తినకూడదు.. మద్యం సేవించినప్పుడు స్వీట్లు అస్సలు తినొద్దు. మద్యం తాగినప్పుడు స్వీట్లు తింటే.. మత్తు రెట్టింపు అవుతుంది. మద్యం సేవించిన తరువాత తీపి పదర్థాలు తినడం విషంతో సమానం అని చెబుతున్నారు.