చిప్స్ తిని చనిపోయిన బాలుడు, వెలుగులోకి సంచలన విషయాలు.

మసాచుసెట్స్‌కు చెందిన 14 ఏళ్ల హారిస్ వోలోబా అనే బాలుడు అత్యంత ఘాటైన టోర్టిల్లా చిప్స్‌ను తిన్నాడు. వన్ చిప్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో తానూ ఒకసారి దాన్ని టేస్ట్ చేయాలని భావించాడు. అయితే అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చనిపోయాడు.
అయితే తమ కొడుకు మృతికి ఆ ఘాటైన చిప్ కారణం అంటూ బాలుడి పేరెంట్స్ సదరు చిప్ కంపెనీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే సోషల్ మీడియాలో వచ్చే ఛాలెంజ్‌లు ప్రాణాలు తీస్తున్నాయని తెలిసినా కొందరు మాత్రం వాటిని వదిలి పెట్టడం లేదు. తాజాగా ఓ 14 ఏళ్ల బాలుడు.. చిప్స్ తిన్న తర్వాత అస్వస్థతకు గురై చనిపోయాడు.
ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి. చిప్స్ తిని చనిపోయేంతంగా అందులో ఏం కలిపారు అంటారా? వన్ చిప్ ఛాలెంజ్‌లో భాగంగా చిప్స్ తిన్న బాలుడు చనిపోవడం అమెరికాలో తీవ్ర కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. మసాచుసెట్స్‌కు చెందిన 14 ఏళ్ల హారిస్ వోలోబా అత్యంత ఘాటైన టోర్టిల్లా చిప్స్‌ను తిన్నాడు.
వన్ చిప్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో తానూ ఒకసారి దాన్ని టేస్ట్ చేయాలని భావించాడు. అయితే అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ హాట్ చిప్ ఛాలెంజ్‌లో పాల్గొనక ముందు తమ కుమారుడు ఆరోగ్యంగా ఉండేవాడని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు తెలిపారు.
హాట్ టోర్టిల్లా చిప్ తిన్న తర్వాత స్కూలుకు వెళ్లాడని.. అయితే కడుపు నొప్పి వచ్చినట్లు చెప్పడంతో వెంటనే స్కూల్ మేనేజ్‌మెంట్ తమ కుమారుడిని ఇంటికి పంపించినట్లు చెప్పారు.