Health

ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే మీ కిడ్నీలో రాళ్లు రావడం ఖాయం.

మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే.. మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు అయిన కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా.. నడుము ప్రాంతంలో వెన్నెముకకు ఇరువైపులా మూత్ర పిండాలు ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలు కిడ్నీలో రాళ్లు కూడా ఒకటి కిడ్నీలో రాళ్లు చేరడం వలన చాలా మంది సతమతమవుతున్నారు.

కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కొన్ని ఆహార పదార్థాలు దారితీస్తాయి. మనం తీసుకునే ఆహారం పై దృష్టి పెడితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లయితే కచ్చితంగా మీకు కిడ్నీలలో రాళ్లు చేరుతాయి మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లు అవుతుంది. కిడ్నీలో రాళ్లు చేరడానికి ఏఏ ఆహార పదార్థాలు దారి తీస్తాయంటే..!

కూల్ డ్రింక్స్..కూల్ డ్రింక్స్ తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కలుగుతాయి. కోలా పానీయాలు కోలా గింజ యొక్క సారాన్ని కలిగి ఉండే వాటిని తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు చేరే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటువంటి పానీయాలని అస్సలు తీసుకోవద్దు. ఎక్కువ సోడియం..ఎక్కువ సోడియం ఉండే వాటిని తీసుకోవద్దు. బాగా డీప్ గా వేయించిన చికెన్ వంటి వాటిని కూడా తీసుకోకండి. ఉప్పుతో వేయించిన గింజలు వంటి వాటికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్..జంక్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండడం మంచిది.

చాలా మంది ఈ మధ్యకాలంలో పిజ్జా, బర్గర్, శాండ్విచ్ వంటి వాటిని తీసుకుంటున్నారు కానీ ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది. ప్రాసెస్ చేసిన మాంసం..ప్రాసెస్ చేసిన మాంసం ఉప్పుతో ఉంటుంది ఇటువంటి వాటిని అస్సలు తీసుకోవద్దు పైగా వీటిలో కెమికల్స్ కూడా ఉంటాయి ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉంది.

బ్లాక్ టీ..ఎక్కువగా మోతాదులో బ్లాక్ టీ ని తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ బ్లాక్ టీ ని కూడా తీసుకోవద్దు. బాదం, జీడిపప్పు..జీడిపప్పు బాదం వంటి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మంచి ఆహారాన్ని మాత్రమే డైట్ లో తీసుకోండి అలా అని ఏ ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోవద్దు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker