Health

ఖాళీ కడుపుతో రోజు రెండు వేప ఆకులు తింటే చాలు, ఆ మొండి రోగాలన్నీ తగ్గిపోతాయి.

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రం ఉగాది రోజు ఉగాది పచ్చ‌డి త‌యారీలో వేప పూత‌ను మ‌నం ఉప‌యోగిస్తాం. వేప చెట్టు వ‌ల్ల మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆయుర్వేద‌ వైద్యులు ఎన్నో ర‌కాల వ్యాధుల‌ నివార‌ణ‌లో వేపాకును ఉప‌యోగిస్తున్నారు. వేప‌లో ఉండే నింబ‌ల్ ప్లేవోయిన్‌ ర‌సాయ‌నం యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌స్ ఏజెంట్‌గా ప‌ని చేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అయితే వేప ఎన్నో గొప్ప ఔషధాలని కలిగి ఉంది. వేప ఆకు నుంచి పువ్వు వరకు ప్రతీ ఒక్కటి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. పూర్వం వేప పుల్లలతోనే పెద్దవాళ్ళు పళ్ళు శుభ్రం చేసుకునే వాళ్ళు.

ఇప్పటికీ పల్లెటూరిలో కొంతమంది అలాగే చేస్తున్నారు. బ్రష్ కంటే ఇదే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. పిల్లకు వేప ఆకులతో తయారు చేసిన పానీయాలు, కషాయం ఇస్తారు. ఇది తాగడం వల్ల పొద్దున్నే మలబద్ధకం సమస్య లేకుండా కడుపు శుభ్రం చేస్తుందని చెప్తారు. ఖాళీ కడుపుతో వేప ఆకులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మెరుగైన గట్ వ్యవస్థ.. వేప ఆకులు ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల పేగు వ్యవస్థని శుభ్రం చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో మనం పాటించే అనారోగ్యకరమైన జీవనశైలి, తీసుకునే ఆహారం, తాగే అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. పేగుల్లో మంట, అసౌకర్యం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

వాటిని నయం చేసేందుకు వేప ఆకులు ప్రభావవంతంగా పని చేస్తాయి. కాలేయ ఆరోగ్యం..పొద్దున్నే నాలుగు వేపఆకులు నమలడం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఫ్రీ రాడికల్స్ వాలల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి కాలేయ కణజాలాల్ని దెబ్బతీస్తుంది. వేప తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరణ..చేదు రుచి కలిగినప్పటికీ వేపని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ్లడ్ షుగర్ సమస్యలు ఉన్నవాళ్ళు పొద్దున్నే కాసిన్ని వేప ఆకులు నమిలితే మంచిది. ఇది ఆరోగ్యాన్ని మొత్తం కాపాడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

పొట్ట సంబంధిత సమస్యల్ని నయం చేయడంలో వేప ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. ఉబ్బరం, మలబద్ధకం వంటి వాటిని సులభంగా నయం చేస్తాయి. వేప ఆకుల్లో ఉండే పీచు పదార్థాలు పేగు కదలికలకు సహాయపడతాయి. ఎలా తినాలి..? వేప ఆకులు తీసుకుని వాటిని శుభ్రంగా నీటిలో కడిగి మిక్సీ లేదా రోట్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాని నుంచి రసాన్ని తీసుకోవచ్చు. వేప ఆకుల పేస్ట్ రుచి చాల చేదుగా ఉంటుంది. అందుకే మిక్సీ వేసినా రోకలితో రుబ్బినా కూడా వాటికి చేదు రుచి అంటుకుంటుంది. వాటితో మిగతావి ఏవి కలిపినా కూడా అది కూడా చేదు రుచిని ఇస్తాయి.

ఎప్పుడు తాజాగా తయారు చేసిన వేప ఆకుల రసాన్ని తీసుకోవాలి. వేప ఆకులు బాణలిలలో వేయించి దాన్ని చేతులతో చూర్ణం చేసుకోవచ్చు. అందులో వెల్లుల్లి, ఆవాల నూనె వేసుకుని కలుపుకోవచ్చు. దీన్ని అన్నంలో కూడా తినొచ్చు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..ఒకేసారి ఎక్కువ వేప ఆకులు తినకూడదు. మంచి చేస్తుందని అతిగా తీసుకుంటే అది అనార్థాలు కలిగిస్తుంది. పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇది ఆహారాలు, మందులకు ఎప్పుడు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker