ఈ సూప్‌తాగితే శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం ఐస్ లా కరిగిపోతుంది.
మన బాడీకి అవసరమైన దాని కన్నా ఎక్కువ ఆహారం తీసుకున్నా సరే అందుకు తగ్గట్లు మనం వ్యాయామాలు చేసే సమయాన్ని పెంచుకోవాలి. అప్పుడు మనం ఎక్కువ ఆహారం తీసుకున్నా సరే కొవ్వు అనేది తయారవకుండా మనం చేసిన వ్యాయామాల ద్వారా జీర్ణం అవుతుంది. అయితే టమాటాలో యాంటీఆక్సిడెంట్‌లు సమృద్దిగా ఉంటాయి. ఇందులో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెజబ్బులు రాకుండా కాపాడగలదు.
విటమిన్ ఎ, బి, సి, కె, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, టమాటాలో సమృద్ధిగా ఉన్నాయి. అన్ని గుణాలు కలిగున్న టమాటాలతో సూప్ తయారు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కావాల్సినవి.. టమాటాలు : 6, కొత్తిమీర తరుగు : అరకప్పు, నీళ్లు : 6 కప్పులు, బ్రెడ్ ముక్కలు : 4, ఉల్లిగడ్డ : 1, వెల్లుల్లి : 2 రేకులు, బిర్యానీ ఆకులు : 2, మిరియాలు : 3, వెన్న లేదా నెయ్యి : 1 టీస్పూన్, క్యారెట్ : 1, చక్కెర : అర టీస్పూన్, ఉప్పు : తగినంత.
తయారీ.. ముందుగా టమాటా, క్యారెట్, నీళ్లు, మిరియాలు, బిర్యానిఆకులు, వెల్లుల్లి, ఉల్లిపాయ, చక్కెర, నీరు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా అయన టమాటా మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి మెత్తగా చేత్తో మెదిపి ఆ గుజ్జును కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు.
లేదా మిశ్రమాన్ని గ్రైండ్ చేసి గుజ్జును వడకట్టి తీసుకోవచ్చు. తర్వాత కడాయిలో వెన్న లేదా నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను వేయించాలి. సూప్ తాగేముందు వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.