Health

జ్వరం వచ్చినప్పుడు చికెన్ ఎందుకు తినకూడదో తెలుసా..?

చికెన్ బిర్యాని, చికెన్ ఫ్రై, చికెన్ మంచురియా, చికెన్ టిక్కా అంటూ చికెన్ తో ఎన్ని రకాల వంటలు చేస్తే అన్ని రకాలను ఇష్టంగా లాగించేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులోనూ మటన్ కంటే చికెన్ ప్రియులే అధిక మొత్తంలో ఉంటారు. ఇష్టమైన చికెన్ ను టేస్టీగా ఎలా వండుకుని తిన్నా అద్బుతమే అంటూ చికెన్ ను పొగుడుతూ ఉంటారు. అందులోనూ వారానికి ఒకసారైనా చికెన్ పక్కాగా తినేవాళ్లు చాలా మందే ఉంటారు. కాగా ఆరోగ్యంగా ఉండేందుకు చికెన్, మటన్, చేపలు బాగా ఉపయోగపడతాయి.

అందులోనూ మాంసాహారం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి కూడా లభిస్తుంది. అయితే సాధారణంగా జ్వరం రావడం అన్నది సహజం. మిగతా సీజన్ లతో పోల్చుకుంటే వర్షాకాలంలో ఎక్కువగా జ్వరాలు వస్తుంటాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రాంతంలో బ్యాక్టీరియా చేరి వైరస్ వ్యాప్తి చెందిలా చేస్తుంది. దాంతో జ్వరం జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి.

నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి లేదంటే మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి జ్వరాల బారిన పడటం ఖాయం. కొన్ని కొన్ని సార్లు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోకుండా జ్వరం వస్తూ ఉంటుంది. అయితే జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా అనిపించి ఏదైనా కొంచెం స్పైసీగా తినాలని చాలామంది భావిస్తూ ఉంటారు. జ్వరం వచ్చినప్పుడు చికెన్ ఫిష్ లాంటివి తినవచ్చా ఏమైనా జరుగుతుందా? ఈ విషయాల గురించి నిపుణులు ఏం తెలిపారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జ్వరం వచ్చిన వ్యక్తి ఎప్పుడూ కూడా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడే తిన్న ఆహారం జీర్ణం అయ్యి శక్తి లభిస్తుంది. కానీ గుడ్లు, చేపలు, చికెన్ లాంటివి తీసుకుంటే అవి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే అజీర్తి వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. దీనివల్ల జ్వరం మరింత పెరిగే అవకాశం అయితే లేదు.

జ్వరం వచ్చినప్పుడు మీకు మాంసాహారం తినాలని అనిపిస్తే అభ్యంతరం ఏమీ లేదని తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ప్రోటీన్స్ కూడా అందుతాయి. అందుకే వీటిని జ్వరం వచ్చినప్పుడు తిన్న ఎటువంటి సమస్య ఉండదు అని చెబుతున్నారు. అయితే జ్వరం వచ్చిన సమయంలో వాంతులు, వికారం లాంటివి ఉన్న వారు తినకపోవడమే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker