News

వినాయకుడు కి ఈ పండ్లు, పూలతో పూజ చేస్తే మీపై ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.

మత విశ్వాసాల ప్రకారం అన్ని దేవీ దేవతల సహా అందరూ మొదట గణేష్ ను పూజిస్తారు. ఏ శుభ కార్యంలో నైనా ముందుగా వినాయకుడిని పూజిస్తారు. బుధవారం గణేశుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నమ్మకం. శివ పార్వతుల తనయుడు గణేశుడు శివునికి ఎంతో ప్రీతిపాత్రుడు. గణేశుడు బుధ గ్రహానికి కారక దేవుడు. వినాయకుడిని బుధవారం ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయడం వలన అతనికి సంతోషం కలుగుతుంది.

భక్తుల బాధలను తొలగిస్తుంది. అయితే వినాయకుడిని చాలామంది పూజిస్తూ ఉంటారు. వినాయకుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా ఇలా చేయండి. వినాయకుడు అనుగ్రహం ఉంటే మనం అనుకున్న పనులు పూర్తి అవుతాయి. మొదట మనం ఏ దేవుడిని పూజించాలన్నా కూడా వినాయకుడిని పూజించాలి వినాయకుడిని పూజిస్తే ఆటంకాలే కూడా లేకుండా మన పనులు పూర్తయిపోతాయి.

వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పూలని పండ్లను పెట్టాలి మందార పూలు వినాయకుడికి చాలా ఇష్టం. అలానే ఎర్రటి పూలను కూడా వినాయకుడి కోసం పెట్టాలి. వినాయకుడిని పూజించేటప్పుడు పారిజాతం పూలు కూడా పెట్టండి వినాయకుడికి ఈ పూలంటే కూడా ఇష్టం. గరిక అంటే కూడా వినాయకుడికి చాలా ఇష్టం.

జిల్లేడు పూలతో వినాయకుడిని పూజిస్తే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది. కదంబ పుష్పాలతో కూడా పూజించండి. పెళ్లి అయ్యి ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు మల్లెపూలతో వినాయకుడిని ఆరాధించడం మంచిది. వినాయకుడికి దానిమ్మ పండ్లు మామిడి పండ్లు అంటే ఇష్టం అలానే అరటి జామ కూడా ఇష్టం.

చెరుకుని కూడా వినాయకుడికి పెట్టండి ఆపిల్ దానిమ్మ ఆరంజ్ ద్రాక్ష నేరేడు పండ్లను కూడా వినాయకుడిని పూజించేటప్పుడు నైవేద్యంగా పెట్టండి. ఇలా కనక మీరు వినాయకుడిని పూజించారంటే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker