ఎయిడ్స్ వ్యాధి కన్నా ప్రమాదకరంగా వ్యాపిస్తున్న మరో సుఖ వ్యాధి, ఆ వ్యాధి లక్షణాలు ఇవే.

గనేరియా అనే సెగవ్యాధి సురక్షితమైన శృంగారం లేకపోవడం వల్ల, ఆ వ్యాధి ఉన్నవారితో సేఫ్‌గా శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వస్తుంది.ఈ వ్యాధి రావడానికి నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా కారణం.సెక్స్ లో పాల్గొన్న 2 నుంచి 5 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన 2021 నివేదిక ప్రకారం..
2020లో 82.4 మిలియన్ల మంది కొత్తగా గోనేరియా బారిన పడ్డారు. STI లపై గ్లోబల్ హెల్త్ సెక్టార్ స్ట్రాటజీ 2016-2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గోనేరియాను 2030 కల్లా 90% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గోనేరియా వ్యాధికారక నైస్సేరియా గోనోరియా వల్ల వస్తుంది. ఇది బ్యాక్టీరియా వల్ల కలిగే రెండవ అత్యంత సర్వ సాధారణమైన లైంగిక సంక్రమణ. ఇది జననేంద్రియాలను, పురీషనాళం, గొంతులో సంక్రమణకు కారణమవుతుంది.
గోనేరియా సాధారణ సంకేతాల్లో.. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, విపరీతమైన యోని ఉత్సర్గ, ఆడవారిలో పీరియడ్స్ మధ్య అసాధారణ ఉత్సర్గ, రక్తస్రావం, పురుషాంగం నుంచి పసుపు లేదా ఆకుపచ్చ ఉత్సర్గ, పురుషాంగం వాపు, వృషణాల నొప్పి ఉన్నాయి. అంతేకాదు ప్రేగు కదలికల్లో ఇబ్బంది కూడా గోనేరియాకు సాధారణ సంకేతమే. గోనేరియా అసాధారణ సంకేతాలు కడుపు నొప్పి లేదా కటి నొప్పి.
యోని ఉత్సర్గ పెరగడం కూడా గోనేరియా లక్షణమే. అయినప్పటికీ ఇది సాధారణంగా ఇతర రకాల ఎస్టీఐలలో కూడా కనిపిస్తుంది. గోనేరియా విషయంలో యోని సంభోగం తర్వాత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. యువకులు ముఖ్యంగా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి గోనేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎక్కువ మందితో సెక్స్ లో పాల్గొనడం వల్ల ఈ సంక్రమణ వచ్చే ప్రమాదం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఈ వ్యాధి జననేంద్రియ ప్రాంతాలతో పాటుగా పురీషనాళం, కళ్లు, గొంతు, కీళ్లకు కూడా గోనేరియా వస్తుంది. గోనేరియా సంకేతాలు వ్యాధి స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కళ్లలో.. ఇది కంటి నొప్పి, కాంతికి సున్నితత్వం, చీము లాంటి ఉత్సర్గకు కారణమవుతుంది. కీళ్లకు సోకితే.. కీళ్లు వేడిగా, ఎరుపుగా, వాపుగా మారతాయి. గొంతు నొప్పి గోనేరియా సంక్రమణకు సంకేతం. బ్యాక్టీరియా పురీషనాళానికి సోకితే మూత్రంలో రక్తం పడుతుంది.