గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నారా..? వాటితో వచ్చే దుష్ప్రభావాలు ఇవే.

1960 లో గర్భనిరోధక మాత్రలు ప్రవేశపెట్టినప్పుడు మహిళలు చాలా సంతోషించారు. గర్భం దాల్చకపోవడం అనేది పూర్తిగా తమ నియంత్రణలో ఉన్నదని వారు భావించారు. అయితే, రాన్రాను వీటి వల్ల కలిగి దుష్ప్రభావాలను చూసి భయపడిపోతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో ప్రతీ ఏటా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు గర్భస్రావాలకు గురవుతున్నారు. వీరిలో 75 శాతం మంది మహిళలు వైద్యుడిని సంప్రదించకుండానే మందులు తీసుకుంటున్నారని తేలింది. అయితే జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడటానికి జనన నియంత్రణ మాత్రలను ప్రవేశపెట్టారు.
కానీ ప్రస్తుతం కండోమ్ లకు ప్రత్యామ్నాయాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి పూర్తిగా సురక్షితమైనవి. అలాగే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) చేత ఆమోదించబడ్డాయి కూడా. ఏదేమైనా ఇవి కూడా ఇతర ముందుల లాగే ఎన్నో దుష్ప్రభావాలను, ప్రమాదాలను కూడా కలిగి ఉంటాయి. ఈ మాత్రల్లో ప్రొజెస్టిన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల సింథటిక్ వెర్షన్లు ఉంటాయి. అండాశయాలు సహజంగా ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. బీసీపీలలో ప్రొజెస్టిన్ మాత్రమే ఉంటుంది. లేదా ఈ రెండు హార్మోన్లు ఉండొచ్చు.

అయితే రెండు హార్మోన్లు అండోత్సర్గమును లేదా స్త్రీ రుతుచక్రం సమయంలో అండం విడుదలను అణిచివేస్తాయి. శరీరం సాధారణ హార్మోన్ల సమతుల్యతను మార్చడానికి ఈ మాత్రలు ఉపయోపడతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత మీ శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్..అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో 2005 అధ్యయనం ప్రకారం.. వీటిని ఉపయోగించిన వారిలో 10 శాతం మంది.. వీటిని ఉపయోగించిన ఒక నెలలోనే తలనొప్పి బారిన పడ్డారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో మార్పులు తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని కలిగిస్తాయి. అలాగే నొప్పిని పెంచుతాయి.

బరువు పెరగడం.. జనన నియంత్రణ మాత్రలను ఎక్కువగా వాడటం వల్ల బరువు కూడా పెరుగుతారు. అవి కొవ్వు లేదా కండర ద్రవ్యరాశితో కలిసి శరీరంలో ద్రవం నిల్వ ఉండేందుకు దారితీస్తుంది. ఇది బరువు పెరిగేందుకు కారణమవుతుంది. అయితే మీరు దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే పక్కాగా బరువు పెరుగుతారు. వీటిని తీసుకోవడం ఆపేసిన తర్వాత బరువు తగ్గుతారు. రొమ్ము సున్నితత్వం.. జనన నియంత్రణ మాత్రలను ఉపయోగించడం వల్ల రొమ్ము సున్నితత్వం సమస్య వస్తుంది.

దీనివల్ల వక్షోజాలు పెద్దవిగా పెరుగుతాయి. రొమ్ముల నొప్పి, రొమ్ముల్లో మార్పులు గమనిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. మానసిక స్థితి మార్పులు..మానసిక స్థితి, భావోద్వేగాలను ప్రభావితం చేయడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. జనన నియంత్రణ మాత్రలు తీసుకునేటప్పుడు హార్మోన్ల స్థాయిలలో మార్పులు మానసిక స్థితి హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. వీటితో పాటుగా గర్భనిరోధక మాత్రల వల్ల పీరియడ్స్ సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ కావడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు రక్తపోటు పెరగడం, కడుపు ఉబ్బరం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి.