Health

చలికాలంలో వేడినీళ్ల కోసం గీజర్ వాడుతున్నారా..? ఈ పొరపాట్లని మాత్రం అస్సలు చెయ్యకండి.

ఈ నెల చివరి నాటికి, దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన చలి మొదలవుతుంది. అంత చలిలో చన్నీళ్ల స్నానం చేయడమంటే మాటలతో పని కాదు. చాలా మంది వేడి నీళ్ల కోసం తాపత్రయపడుతుంటారు. కొందరు కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకుంటారు. కొందరు బాత్రూమ్‌ల్లో గీజర్ల పై ఆధారపడుతుంటారు. అయితే గీజర్లు వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ ప్రమాదాలు జరిగే వీలుంది. అయితే చల్లటి నీటితో స్నానం చేసే ధైర్యం ఎవ్వరు చేయరు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే కట్టెల పొయ్యిపై నీటిని వేడి చేసుకుంటారు. మరి కొందరు హీటర్లు, గీజర్‌లను వాడుతుంటారు.

అయితే గీజర్‌లు వాడే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. గీజర్‌ను ఇష్టానుసారంగా వాడితే కుదరదు. లేకుంటే ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గీజర్‌ ఏ కంపెనీ అయినా అది ISI ప్రమాణాలతో ఉందో లేదో తెలుసుకోవాలి. మంచి బ్రాండ్‌తో ఉన్న గీజర్‌ను కొనుగోలు చేయడం మంచిది. ఫైవ్‌ స్టార్‌ రేటంగ్‌తో ఉన్నవాటిని కోనుగోలు చేయాలి. ఎక్కువ ప్రెజర్‌ని అదుపు చేసే విధంగా, ట్యాంక్ పేలకుండా ఉండేలా నివారించేందుకు ప్రెజర్ కంట్రోల్ ఫీచర్ తప్పకుండా ఉండాలి. ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ సిస్టమ్‌తో ఉన్న గీజర్‌ కొనుగోలు చేయండి.

గీజర్‌ కొనుగోలు చేసిన తరర్వాత మంచి ఇంజనీర్‌తోనే ఇన్‌స్టాల్ చేయించుకోవడం ఉత్తమం. గీజర్‌కు గోడకు మధ్య ఖచ్చితంగా కొంత గ్యాస్‌ ఉండేలా చూసుకుని జాగ్రత్తలు తీసుకోవాలి. బాత్‌రూమ్‌ కోసం ఎప్పుడూ పెద్ద ఉండాలి. అది కూడా 10 నుండి 35 లీటర్ల గీజర్ ఉండేలా ప్లాన్‌ చేసుకోండి. గీజర్ నుంచి మీథేన్, ప్రొపేన్ వంటి వాయువులు విడుదల అయ్యి కార్బన్ డై ఆక్సయిడ్ గా మారతాయి. గీజర్‌ను 5 నుంచి 10 నిమిషాలు వేస్తే చాలు మనకు కావాల్సినంత వేడి అవుతుంది. ఎక్కువ వేడి కావాలంటూ ఎక్కువ సమయం వేస్తే పేలిపోయే ప్రమాదం ఉంది. స్నానానికి ముందు గీజర్ ఆన్ చేసుకుని.. హీట్ కాగానే స్వీచ్ ఆఫ్ చేసుకోవడం మంచిది.

ఎట్టి పరిస్థితుల్లో గీజర్ స్వీచ్ ఆన్ చేసుకోని అలాగే స్నానం చేయడం చాలా ప్రమాదకరం అని గుర్తించుకోండి. చేతులు తడిగా ఉన్న సమయంలో గీజర్‌ను ఆన్ చేయడం, లేదా ఆఫ్‌ చేయడం మంచిది కాదు. ప్రాణాలకే ప్రమాదమని గుర్తించుకోండి. గీజర్ ఏదైనా రిపేరుకు వస్తే సొంత ప్రయోగం చేయవద్దు. మంచి టెక్నిషియన్‌తోనే రిపేరు చేయించడం ఉత్తమం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచండి గీజర్‌ ఉపయోగించే వారు పిల్లలకు అందుబాటులో లేకుండా ఏర్పాటు చేయండి.

గీజర్‌లు పేలుడు, ఇంటిలోని ప్రతి ఒక్కరికీ ప్రమాదకరమైనవి. జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రమాదమేనని గుర్తించుకోండి. గ్యాస్‌తో నడుస్తున్న మీ వాటర్ హీటింగ్ పరికరాల నుండి మీ పిల్లలను వీలైనంత దూరంగా ఉంచేలా చూసుకోండి. గ్యాస్ గీజర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయమని ఎప్పుడు కూడా పిల్లలకు చెప్పకూడదు. దాని చుట్టూ సేఫ్టీ గ్రిల్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి లేదా పిల్లలకు అందుబాటులో లేని ప్రదేశంలో ఉంచండి. దానిని లాక్ చేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker