Health

కన్యత్వాన్ని తిరిగి పొందవచ్చా..? వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోండి.

అమ్మాయి కన్య అని నిరూపిస్తూ సర్టిఫికేట్‌లు కావాలని కూడా కొంత మంది అబ్బాయిలు అడుగుతారు. అయితే, ఇలాంటి విధానం మానవ హక్కులకు వ్యతిరేకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గత ఏడాదిగా ఈ విధానానికి వ్యతిరేకంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అయితే కన్యత్వాన్ని తిరిగి పొందే సర్జరీని ‘హైమనోప్లాస్టీ’ అని అంటారు. దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ సర్జరీలు జరుగుతున్నాయి. అయితే, ఇది కేవలం అమెరికా, యూకే వంటి దేశాల్లో మాత్రమే ఉండేది. తాజాగా ఇది మన ఇండియాలోని మెట్రో సిటీలకు కూడా పాకింది. ఇటీవల పెళ్లికి ముందే ఆ అనుభవం పొందేవారి సంఖ్య పెరిగింది. చిన్న వయస్సులోనే లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తమ భాగస్వామితో ఏమైనా సమస్యలు వస్తాయనే భయాందోళనలతో అమ్మాయిలు వైద్యులను సంప్రదిస్తున్నారు. అలాంటివారికి వైద్యులు ఈ హైమనోస్లాస్టీ సర్జరీ నిర్వహిస్తున్నారు. హైమనోప్లాస్టీ సర్జరీలో భాగంగా కన్నెపొర కోల్పోయిన అమ్మాయిల యోని లోపల పలుచని పొరను ఏర్పాటు చేస్తారు. ఈ క్లిష్టమైన ఆపరేషన్‌కు సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. పెళ్లికి సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల ముందే ఈ సర్జరీ చేయించుకోవాలట. ఆ తర్వాత ఆ యువతి సెక్స్, స్వయంతృప్తికి దూరంగా ఉండాలి.

సైకిల్ తొక్కడం, వ్యాయామాలు చేయడం, పరుగులు పెట్టడం.. చివరికి స్కూటర్ కూడా నడపకూడదట. ఈ సర్జరీకు సుమారు రూ.70 వేలు వరకు ఖర్చవుతుందని అంచనా. ఇలాంటి సర్జరీలను వెంటనే ఆపాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇలాంటి సర్జరీల వల్ల కన్యత్వం తప్పనిసరే అనే భావనను బలపరుస్తున్నట్లుగా ఉందని, అంతేగాక కన్యత్వ నిర్ధరణ పరీక్షలను కూడా నిలిపేయాలని బలంగా డిమాండ్ వినిపిస్తోంది. మన దేశంలో ఇలాంటి సర్జరీలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పెళ్లికి ముందు సెక్స్‌ను ఎంజాయ్ చేసే యూకే వంటి దేశాల్లో కూడా ఇలాంటి సర్జరీలు వందల సంఖ్యలో జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ‘హైమనోప్లాస్టీ’ సర్జరీలను నిషేదించాలనే డిమాండ్ వినిపిస్తోంది. పెళ్లి కోసం, భవిష్యత్తు కోసం భయాందోళనలతో వైద్యులను సంప్రదించే అమ్మాయిలను కొంతమంది వైద్యులు మోసం చేస్తున్నారు. యూకేలో ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. వర్జినిటీ రిపైర్‌కు బదులు నకిలీ సర్జరీలు చేస్తున్నారు. ఇలాంటి చికిత్సలు చేస్తే.. వర్జినిటీ రిపైర్ సర్జరీలను చట్టవిరుద్ధం చేస్తామని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) హెచ్చరించింది. కన్యత్వాన్ని పునరుద్ధరించే సర్జరీలను నిషేదించకపోతే.. కన్యత్వ పరీక్షలను బ్యాన్ చేయాలనే డిమాండ్‌‌కు అర్థం ఉండదని తెలిపింది.

తొలిరాత్రి అమ్మాయి రక్తాన్ని స్రవిస్తే.. ఆమె కన్య అనే భావన కలుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు, బంధువులు బలవంతంగా ఇలాంటి ఆపరేషన్లు చేయిస్తు్న్నారని తెలిసింది. రక్తనాళలతో అత్యంత పలుచుగా ఉండే ఈ పొర పగిలినప్పుడు రక్తం కారుతుందని, కొందరికి పొర చీలినా రక్తస్రావం ఉండదని RCOG ప్రతినిధులు స్పష్టం చేశారు. కాబట్టి.. కన్నెపొరను కన్యత్వానికి ప్రామాణికంగా తీసుకోకూడదని తెలిపారు. అయితే, ఇప్పట్లో ఈ సర్జరీలను నిషేదించే ఆలోచనలో ప్రభుత్వాలు లేనట్లు తెలుస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker