News

మహిళలకు అదిరే శుభవార్త, 950 పతనమైన బంగారం ధర. కానీ అంతలోనే..!

బంగారం ధరలు గత నాలుగైదు రోజుల నుంచి పైపైకి చేరుతూనే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా పసిడి రేట్లు దూసుకుపోయాయి. ఇటీవలనే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకిన పసిడి రేట్లు .. తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే గత నాలుగైదు రోజుల నుంచి మాత్రం మళ్లీ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే దేశంలో కొంత కాలంగా పసిడి, వెండి ధరలు నిరంతరంగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తుంది. బంగారం కొని దాచుకుంటే భవిష్యత్ లో భారీ రేటు పలుకుతుందని మధ్యతరగతి కుటుంబికులు భావిస్తున్నారు.

అందుకే బంగారం పై ఇన్వెస్ట్ పెట్టేందుకు ఉత్సాహపడుతున్నారు. అంతేకాదు బంగారం ఆపద సమయంలో వెంటనే ఆదుకుంటుంది. దీంతో దేశంలో పసిడి కొనుగోలు భారీగా పెరిగుతుంది.. దాంతో పాటే డిమాండ్ కూడా పెరుగుతుంది. నేటి ఉదయానికి ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,260 కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.420 పెరిగింది.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,360 వద్ద ట్రెండ్ అవుతుంది.దేశ ఆర్థిక రాజధాని ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,760 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,920 వద్ద ట్రెండ్ అవుతుంది. కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద ట్రెండ్ అవుతుంది.

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,110 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,210 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి పై రూ.100 పెరిగింది. ఢిల్లీతో పాటు ముంబై,బెంగుళూరు, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 97,800 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రలతో పాటు చెన్నై లో కిలో వెండి ధర రూ. 1,02,300 వద్ద ట్రెండ్ అవుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker