Health

వర్షపు నీరు తాగితే మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.

వర్షపు నీరు పంపు నీటి కంటే, చవకైన, మెరుగైన ప్రత్యామ్నాయం. ఇందులో ఉన్న అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వర్షపు నీటిని తాగడం వల్ల దాని ఆల్కలీన్ pH కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతారు. అలాగే రక్తపోటు సమస్య కూడా అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. వర్షపు నీరు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వర్షపు నీటిలో ఆల్కలీన్ pH చర్మం, సహజ స్థితిస్థాపకత, తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది. వర్షపు నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టు బలపడుతుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.

వర్షపు నీటిని చర్మంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు పోతాయి. అయితే ఆయుర్వేద వైద్యురాలు, డాక్టర్ రేఖా రాధామోని.. వర్షపు నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. ‘అంతరీక్ష జలం’ అని కూడా పేర్కొనే వర్షపు నీటిని తాగాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుందని ఆమె వివరించారు. అలాగే వర్షపు నీటిని వినియోగించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా షేర్ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. వర్షపు నీటిని సేకరించడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా అవసరం.

వర్షాకాలం ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత పడే వాననీటిని సేకరించాలి. ఆ వర్షపు నీరు తాగడానికి అనువైనదిగా పరిగణిస్తారు. ఇందుకు సేకరణ కోసం రాగి పాత్రలను ఉపయోగించడం మంచిది. రాగికి నీటి నాణ్యతను పెంచే లక్షణం ఉంటుంది. వర్షపు నీటిని తాగే ప్రక్రియలో.. వర్షం పడిన గంట తర్వాత నీటిని సేకరించాలి. తర్వాత చంద్రకాంతిలో రాత్రిపూట ఆ నీటిని అలానే వదిలేయాలి. అవసరం అనుకుంటే గిన్నెను సన్నని కాటన్ వస్త్రంతో కప్పి ఉంచవచ్చు.

మరుసటి రోజు ఆ నీటిని మరిగించి తాగాలి. కాలుష్య ప్రాంతాల్లో తాగకూడదు..ఆయుర్వేదంలో వర్షపు నీరు అమృతం లాంటిదని డాక్టర్ రేఖ వివరించారు. ఇది శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది, కంఫర్ట్‌ను అందిస్తుంది. అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసించే వారు వాననీటిని తాగకపోవడం మంచిది. పొల్యూషన్‌ లెవల్స్‌ కారణంగా అక్కడి రెయిన్ వాటర్ ప్యూరిటీ దెబ్బతినడమే ఇందుకు కారణం.

అలాగే వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఈ పద్ధతి సరైనది కాదు. వాననీరు సురక్షితమా? కాదా? ఎలా తెలుసుకోవాలి వర్షాకాలంలో వాన నీటిని తాగడం మంచిది. సేకరించిన వర్షపు నీరు తాగడానికి అనుకూలంగా ఉందో లేదో టెస్ట్ చేయవచ్చు. ఎలాగంటే.. వాన నీటితో అన్నం వండి, దాన్ని శుభ్రమైన వెండి ప్లేట్‌లో ఉంచాలి. రైస్ మరీ మెత్తగా అవ్వడం లేదా రంగు మారడం గమనిస్తే.. ఆ నీరు తాగడానికి పనికిరాదు. ఒకవేళ రంగు మారకుండా ఉంటే, వర్షపు నీరు వినియోగానికి సురక్షితంగా ఉన్నట్లు భావించాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker