30 ఏళ్ల తర్వాత కలుసుకోబోతున్న సూర్య, శని గ్రహాలు, ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..!
కర్మల అనుసారం ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఆయన్ని కర్మల ఫల దాత అని కూడా పిలుస్తారు. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశి చక్రం మార్చుకుంటూ ఉంటుంది. సూర్యుడు-శని కలయిక అహం ఘర్షణలు.. విభిన్న ఆలోచన ప్రక్రియల కారణంగా కొందరి జాతకంలో తండ్రి. కొడుకుల మధ్య అభిప్రాయ భేదాలను కలిగిస్తుంది. అదే సమయంలో సూర్య, శనిశ్వరుడిని కలయిక కారణంగా కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
సింహ రాశి:- తండ్రి కొడుకుల కలయిక ఈ రాశికి చెందిన వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం అయి… సంతోషంగా జీవించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ పెట్టుబడుల వలన లాభాలను పొందుతారు. అంతేకాదు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది, మిథున రాశి:- 30 ఏళ్ల తర్వత శని సూర్యుడి కలయిక వలన మిథున రాశులకు చెందినా వ్యక్తులకు శుభప్రదం కానుంది.
ఉద్యోగస్తులు సుభవార్త వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అంతేకాదు వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులకు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, గౌరవం అందుకుంటారు. మకర రాశి:- ఈ రాశికి చెందిన వారికి ఈ రెండు గ్రహాల కలయికతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఉద్యోగస్తులు తమ పని తీరుతో అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్ సక్సెస్ ను అందుకుంటారు. ఆర్ధికంగా లాభలను పొందుతారు. కోరుకున్న కోర్కెలు నెరవేర్చుకుంటారు. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అనారోగ్యం బారిన పడే అవ ఆకాశం ఉంది.