News

గూగుల్‌ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట లారీని ఎలా ముంచిందో చుడండి.

సిద్ధిపేట జిల్లాలో ఓ లారీ డ్రైవర్‌ గూగుల్ రూట్ మ్యాప్‌ ఆధారంగా గమ్యానికి వెళ్లాలనుకున్నాడు. కానీ తీరా చూస్తే కథ అడ్డం తిరిగింది. మ్యాప్‌లో రోడ్డుంది గానీ కళ్ల ముందు పెద్ద ప్రమాదం కనిపించింది. సెప్టెంబర్ 5 రాత్రి తమిళనాడు నుంచి చేర్యాల మీదుగా హుస్నాబాద్‌కు ఓ లారీ డ్రైవర్‌ లోడ్‌తో బయల్దేరాడు. లారీలో డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్య ఉన్నారు. ఐతే చీకట్లో వాళ్లు వెళ్లే రూటు అర్థంకాక తికమకపడ్డారు.

దీంతో ఫోన్‌లో గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు. అయితే టెక్నాలజీ సహాయంతో ప్రతి పనిని సులభంగా చేసుకుంటున్నాం. కొన్ని సమయాల్లో టెక్నాలజీని నమ్ముకుంటే కొంపలు మునుగుతున్నాయి. గూగుల్ మ్యాప్ లో దారిని చూస్తూ లారీని నడిపిన డ్రైవర్ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకొన్నారు. గూగుల్ మ్యాప్ చూస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులోకి లారీ డ్రైవర్ లారీని తీసుకెళ్లాడు.

చివరకు లారీ నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. హైద్రాబాద్ నుండి హుస్నాబాద్ కు లారీని తీసుకెళ్తున్నాడు డ్రైవర్. రామవరం నుండి హుస్నాబాద్ కు వెళ్లే మార్గం తెలియదు. అతనితో పాటు ఉన్న క్లీనర్ కు కూడ ఈ మార్గం కొత్త. దీంతో తమ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ సహాయంతో హుస్నాబాద్ కు పయనమయ్యారు. నందారం స్టేజీ వద్ద రోడ్డు డైవర్షన్ ఉంది.

ఈ మేరకు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లు రోడ్డు పక్కకు పడిపోయాయి.ఈ విషయాన్ని లారీ డ్రైవర్ గుర్తించలేదు. గూగుల్ మ్యాప్ ఆధారంగా అలానే లారీని ముందుకు పోనిచ్చాడు. లారీ గౌరవెళ్లి ప్రాజెక్టులోకి గూగుల్ మ్యాప్ దారి చూపింది. అలానే డ్రైవర్ లారీని ముందుకు నడిపాడు. నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి లారీ వెళ్లి నిలిచిపోయింది.

లారీ డ్రైవర్, క్లీనర్ నీటి నుండి బయటకు వచ్చి స్థానికులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు జేసీబీ సహాయంతో లారీని బయటకు తీసుకు వచ్చారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker