Health

గ్రీన్ టీ తాగేవారు ఈ అపోహాలను ఎప్పుడు అస్సలు నమ్మొద్దు.

రక్తహీనత సమస్య ఉన్న వారు భోజనం చేశాక రెండు గంటల తరువాత గ్రీన్ టీ తాగాలి. లేదంటే శరరీం ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది. అలాగే నిద్రపోయే ముందు కూడా గ్రీన్ టీ తాగరాదు. గ్రీన్ టీ వల్ల నిద్రలేమి సమస్య తప్పదు. అందుకే రాత్రిపూట గ్రీన్ టీ తాగరాదు. రోజుకు 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీని తాగవచ్చు. అయితే గ్రీన్ టీ గురించి ఈ అపోహలను పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు. గ్రీన్ టీ ఆరోగ్య ప్రయోజనాల కోసం తాగుతుంటారు.

చాలా మంది బరువు తగ్గడం కోసం రోజంతా అనేక కప్పుల గ్రీన్ టీ తాగేస్తుంటారు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులోని యాసిడ్ స్థాయిలకు భంగం వాటిల్లుతుందని, ఎసిడిటీకి కారణమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక రోజులో 4 కప్పుల కన్నా ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకూడదు. సాధారణ టీ, కాఫీ కన్నా గ్రీన్ టీలో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు అని అందరూ నమ్ముతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది అపోహ మాత్రమే.

గ్రీన్ టీలో కెఫిన్ కచ్చితంగా ఉంటుంది. అదేపనిగా తాగడం ద్వారా పెద్ద పరిమాణంలో కడుపులో ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. గ్రీన్ టీ రాత్రిపూట తాగడం ద్వారా బరువు తగ్గించడంలో సాయపడదని అందరూ తెలుసుకోవాలి. గ్రీన్ టీ కొవ్వును కరిగించదు. ఇది తాగితే బరువు కూడా తగ్గరు. ఇది ఒక పానీయం లాంటిది మాత్రమే. కానీ, కచ్చితంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని పోషక నిపుణురాలు తెలిపారు. అసలు గ్రీన్ టీకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే.. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది.

ముఖ్యంగా కాటెచిన్స్. అయితే, బ్లాక్ లేదా హెర్బల్ టీలు వంటి ఇతర టీలు, పానీయాలు కూడా ప్రత్యేకమైన ఆరోగ్య ప్రోత్సాహకాలను అందిస్తాయని షోషక నిపుణురాలు వీడియోలో తెలిపారు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కొన్నింటిని పోషక నిపుణులు సూచించారు. మీరు వీటిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క, సోంపు, తులసి, అల్లం టీ పసుపు, నల్ల మిరియాలు టీ. అయితే, గ్రీన్ టీలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ సెల్యులార్ డ్యామేజ్‌ని నిరోధించడంలో సాయపడుతుంది. అంతేకాదు.. గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా సాయపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker