Health

ఈ పువ్వులను చూసి పనికిరాని పూలు అనుకుంటున్నారా..? వాటిలోని ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకుని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపిస్తుంది ‘గునుగు పువ్వు’. తెలతెలవారుతుండగా మంచు బిందువులను మోస్తూ భానుడి లేలేత కిరణాలకు సింగిడి రంగులను ప్రతిబించించే గునుగు పువ్వు అంటే తెలియనివారు ఉండరు. అయితే.. బతుకమ్మను పేర్చడానికి గునుగు పూలనే ప్రత్యేకంగా తీసుకుంటున్నారంటే.. ఈ పువ్వులలో ఏదో ఒక విశిష్టత ఉండి ఉండాలి.

ఖచ్చితంగా ఈ పువ్వులలో విశిష్టత ఉంది కానీ.. అది మనకు తెలియదు. ఏదో అందరూ వాడుతున్నారు కాబట్టి మనమూ వాడేస్తున్నాం. అయితే.. గునుగు పువ్వులను కేవలం.. బతుకమ్మ పువ్వుల కోసమే కాకుండా… వాటిని ఆయుర్వేదంగా చూడొచ్చు. ఈ పువ్వులలో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. వీటి వాసన పీల్చినా చాలు.. ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి.

అందుకే వీటిని బతుకమ్మ కోసం తీసుకొచ్చి పేర్చుతుంటారు. గునుగు మొక్క ఆకులను వండుకొని కూడా తినొచ్చు..అవును.. గునుగు పువ్వులు ఎంత గొప్పవో.. వాటి ఆకులు కూడా అంతే గొప్ప గుణాలను కలిగి ఉంటాయి. ఈ మొక్క ఆకులను ఒకప్పుడు మన ముత్తాతలు.. కూరగా వండుకొని తినేవారట. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కలో చాలా విటమిన్స్ ఉంటాయి.

మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే… గునుగు పువ్వు లేత ఆకులను కూరగా వండుకొని తింటారు. ఈ మొక్క ఆకులు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబయల్ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే.. ఈ మొక్క ఆకులను ఎక్కువగా ఆయుర్వేద మందులలోనూ ఉపయోగిస్తారు.

ఈ ఆకులను రుబ్బి.. పేస్ట్ గా చేసి.. శరీరం మీద గాయాలు అయితే పెట్టుకోవచ్చు. చర్మ సమస్యలలు ఉన్నవాళ్ల కూడా ఈ ఆకు పేస్ట్ ను పెట్టుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నా.. రక్త హీనత ఉన్నా.. హైబీపీ ఉన్నా.. ఇలా ఎన్నో రకాల వ్యాధులకు ఒకే ఒక్క ఔషధం.. గునుగు ఆకులు. ఇప్పటికీ.. మారుమూల ప్రాంతాల్లో ఈ చెట్టు ఆకులను వండుకొని తింటుంటారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker