Health

శోభనం రాత్రి ఈ మాడుగుల హల్వా తింటే చాలు, మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.

విశాఖ వచ్చిన చాలా మంది నేతి వాసనతో ఘుమఘుమలాడే మాడుగుల హల్వాను రుచి చూడకుండా వెళ్లరు. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా అని గుర్తింపు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు మాడుగుల నుంచి 20కి పైగా దేశాలకు ఈ హల్వా ఎగుమతి అవుతోంది. అయితే మాడుగుల నియోజకవర్గం పేరు చెబితే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది హల్వా. సుమారు 150 సంవత్సరాలు క్రితం నుంచే ఇక్కడ కొన్ని కుటుంబాలు ఈ హల్వా తయారీపై ఆధారపడి జీవనాధారం సాగిస్తూ వస్తున్నాయి.

ఇక్కడ తయారయ్యే హల్వాలో ఎలాంటి హానికరమైన కెమికల్స్ కాని లేదా కలర్స్ కాని లేకుండా తయారు చేయడం ఈ మాడుగల హల్వాకు ఉన్న మరో ప్రత్యేకత. మొదట్లో దీనిని సాంప్రదాయబద్ధంగా పంచదార, నెయ్యితో తయారు చేసిన స్థానిక స్వీట్ ఐటంగానే చెప్పుకునేవారు. కానీ రాను రాను ఇది ఒక ఫేమస్ స్వీట్ ఐటంగా ప్రాచుర్యం పొందడంతో కాలక్రమంలో ఈ స్వీట్ బిజినెస్‌పైనే ఆధారపడుతూ చుట్టుపక్కల సుమారు 1800 షాపులు వరకు ఏర్పడ్డాయి. మాడుగుల హల్వాకు మరొక ప్రత్యేకత కూడా ఉంది.

కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి మొదటి రాత్రి రోజు ఈ స్వీట్ తింటే వారి దాంపత్య జీవితం ఆనందంగా గడుస్తుంది అనేది ఇక్కడి వారి నమ్మకం. అందుకే శోభనం రాత్రి కొత్త జంటకు ఇచ్చే స్వీట్స్ లో ఈ మాడుగుల హల్వ తప్పకుండా ఉండాల్సిందే అంటారు ఇక్కడి వారు. ఈ హల్వా తయారీ, విక్రయాలతో ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది కుటుంబాలు జీవనాధారం సాగిస్తున్నాయి.

ఇప్పటికీ సుమారు 1500 నుంచి 2000 మంది ఈ హల్వా తయారీ, విక్రయాలతో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ హల్వాలో డ్రై ఫ్రూట్ హల్వా, షుగర్ ఫ్రీ హల్వా అంటూ రకరకాల ఫ్లేవర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డయాబెటిస్ తో బాధపడే వారిని కూడా దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ షుగర్ ఫ్రీ హల్వా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ హల్వా ధరలు ఫ్లేవర్‌ని బట్టి సుమారు రూ. 400 నుంచి 1000 రూపాయల వరకు ఉన్నాయి.

ఈ మాడుగుల హల్వాకు ఏపీలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా, వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతులు అవుతున్నాయంటే ఈ హల్వాకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మాడుగుల హల్వాకు దేశ, విదేశాల నుండి ఆర్డర్స్ వస్తున్నాయి అని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker