News

‘హ్యాపీ డేస్’ అప్పు ఇప్పుడెలా ఉందో తెలుసా..? చుస్తే గుర్తు కూడా పట్టరు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇంజినీర్ విద్యార్థుల భవితను మార్చేసింది. ఈ సినిమా చూసి ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరినవారు కోకొల్లలు. ఇక వీరితో పాటు ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి గాయత్రీ రావు. ఒకప్పటి నటి పద్మ కూతురుగా ఆమె హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది. అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ సినిమా ఓ సంచలనం. ఇంకా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్.

కాలేజ్ బ్యాక్‌డ్రాప్ కథలకు అప్పట్లో శివ మాస్ టచ్ ఇస్తే.. హ్యాపీ డేస్ ఫ్రెండ్ షిప్ టచ్ ఇచ్చి పిచ్చెక్కించాడు శేఖర్ కమ్ముల. ఈయన నుంచి వచ్చిన ఈ చిత్రం 2007లోనే దాదాపు 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ సినిమాలో నటించిన వాళ్లంతా కూడా ఇప్పటికీ అదే పేరుతో ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అంతగా వాళ్ల కారెక్టర్స్‌కు కూడా గుర్తింపు తీసుకొచ్చింది హ్యాపీ డేస్.

వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు ఇలా చాలా మంది హ్యాపీ డేస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో కొందరు మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్ గాళ్ ప్రెండ్ పాత్రలో నటించిన అప్పు కూడా ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోయింది. అందులో 8 మంది పాత్రలు కూడా బాగా రిజిష్టర్ అయిపోయాయి. వాళ్ల చుట్టూనే కథ కూడా తిరుగుతుంది. ఇదిలా ఉంటే అందులో నటించిన వాళ్లంతా ఇప్పుడు చాలా మారిపోయారు.

వాళ్లలోనే గాయత్రీ రావు కూడా ఉంది. అంటే అప్పు అన్న మాట. ఈమె తల్లి దండ్రులు కూడా నటులే. వీళ్ళ అమ్మగారు బెంగళూరు పద్మగా ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. అలా గాయిత్రి రావుకు హ్యాపీ డేస్‌లో అవకాశం వచ్చింది. తొలి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆరెంజ్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నటించింది. అయితే గబ్బర్ సింగ్ తర్వాత అప్పు పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకొని చెన్నైలో స్థిరపడింది గాయత్రి.

ఇప్పుడు ఈమెను చూస్తే కనీసం గుర్తు కూడా పట్టరు. అంతగా మారిపోయింది అప్పు. అప్పుడు చాలా సన్నగా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు బరువు పెరిగిపోయింది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అవకాశం వస్తే మళ్లీ నటిస్తానని చెప్పింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది గాయత్రి రావు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker