Health

తలనొప్పి తరచూ వస్తుందా..? అది బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు.

మెదడు కణితులు చిన్న పరిమాణం నుండి పెద్ద పరిమాణంలో ఉంటాయి. కొన్ని మెదడు కణితులు చిన్నవిగా ఉన్నప్పుడు కనిపిస్తాయి. వీటిని వెంటనే గమనించొచ్చు. ఇతర కణాలను గమనించకముందే పెరుగుతాయి. మొదడు కణుతులు తక్కువగా చురుగ్గా ఉంటే వెంటనే లక్షణాలను చూపించకపోవచ్చు. లక్షణాలను గమనించక ముందే కణితి పరిమాణం పెద్దదిగా మారొచ్చు. అయితే చాలా మంది తల నొప్పి తో బాధ పడుతూ ఉంటారు. తల నొప్పి లో ఉన్న వారందరికీ ట్యూమర్ ఉన్నట్టు కాదు.

చాలా మంది ఈ తలనొప్పి ఉంది కదా ట్యూమర్ ఉందేమో అని అనుకుంటారు అయితే నిజానికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తలనొప్పి వస్తుంది. రెగ్యులర్ గా తల నొప్పి వస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. డాక్టర్ సలహాలు తీసుకోవాలి. తల నొప్పి నుండి బయట పడడానికి చూసుకోవాలి తలనొప్పి రెగ్యులర్ గా వచ్చిందంటే బ్రెయిన్ క్యాన్సర్ కి సంబంధం ఉన్నట్లుగా అనుమానించండి. మొదట్లో కొద్దిగా తల నొప్పిగా ఉంటుంది అయితే రాను రాను కూడా ఆ తలనొప్పి విపరీతంగా పెరిగిపోతుంది.

మన శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి ప్రతి అవయవం కూడా అనేక కణాల తో ఉంటుంది అయితే ఎక్కువ జీవ కణాలు ఒక దానితో ఒకటి కలిసి ఏర్పడితే అది కనితి రూపం తీసుకు వస్తుంది. వైద్యభాష లో దీనిని క్యాన్సర్ అంటారు నియంత్రణ లేకుండా ఇవి పెరిగిపోతాయి కణజాలన్నీ నాశనం చేస్తాయి. అయితే మెదడులో ఏ భాగానికైనా కూడా ఈ సమస్య వస్తుంది.

దీనిని బ్రెయిన్ క్యాన్సర్ అని పిలుస్తారు బ్రెయిన్ క్యాన్సర్ ని బ్రెయిన్ ట్యూమర్ అని కూడా పిలుస్తారు. అయితే కణాలు వేగంగా పెరిగే కొద్దీ కణాలు కారణంగా బ్రెయిన్ పనితీరు కూడా మారిపోతుంది ట్రీట్మెంట్ కనుక లేదు అంటే అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి రెగ్యులర్ గా మీకు తలనొప్పి వస్తున్నట్లయితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు కొంత మందిలో త్వరగా లక్షణాలు కనబడతాయి కొంత మందిలో ఆలస్యంగా లక్షణాలు కనబడతాయి.

బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు.. సరిగ్గా ఆలోచించలేకపోవడం, కళ్ళు కనిపించకపోవడం, రాత్రిపూట తలనొప్పి రావడం, వికారం, శరీర భాగాలు పట్టుకోవడం, నడుస్తున్నప్పుడు ఇబ్బంది, మాట్లాడలేకపోవడం, కళ్ళు తిరగడం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker