News

రాత్రి భోజనం తర్వాత హఠాత్తుగా గుండెపోటుతో 17 ఏళ్ల బాలిక మృతి.

జిమ్ చేస్తున్నప్పుడు, నిద్రలో వున్నప్పుడు, ఇతర పనులు చేస్తున్నప్పుడు హార్ట్ ఎటాక్ వచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఛాతీలో నొప్పి రావడంతోపాటు అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడంలాంటివి గుండెపోటుకు కారణాలయ్యే అవకాశం ఉంది. అయితే ఇండోర్‌లో 17 ఏళ్ల బాలిక రాత్రి భోజనం చేసిన తర్వాత హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. మృతురాలికి గుండె సంబంధిత సమస్యల చరిత్ర లేదు. టైఫాయిడ్ నుండి ఇటీవల కోలుకున్నప్పటికీ, గుండెపోటుకు గురై మరణించడం తల్లి దండ్రులను కలచివేస్తోంది.

యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అవగాహన పెంపొందించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. మరణించిన సంజనా యాదవ్‌ మొదటి సంవత్సరం కళాశాల విద్యార్థిని. గుండెపోటుకు గురయ్యే ముందు తన కుటుంబంతో కలిసి డిన్నర్ చేసింది. ఆమె ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పింది. ఆ సమయంలోనే తీవ్రమైన చెమటను అనుభవించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్ట్‌గా అనుమానిస్తున్నామని, శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని మల్హర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేష్ భడోరియా తెలిపారు.

కార్డియాలజిస్ట్ డాక్టర్ AD భట్నాగర్ మాట్లాడుతూ.. “ఆమెకు హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ వంటి ఏదైనా ప్రమాద కారకాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. ఆమెకు ఈ కారకాలు ఏవైనా ఉంటే, చల్లని వాతావరణం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు అని పేర్కొన్నారు. “గుండె కండరం అంతర్లీనంగా బలహీనంగా ఉంటే, లేదా ఎలక్ట్రిక్ కండక్షన్ సిస్టమ్‌లో (రిథమిక్ బీటింగ్‌ను నియంత్రించే) సమస్య ఉంటే, అది కూడా గుండెపోటుకు దారితీయవచ్చు. ఎస్‌ఐ బ్రిజేష్ ధుర్వే, “ఆమె కుటుంబంలో గుండె సంబంధిత సమస్యలు లేవు.

సంజనకు నాలుగు నెలల క్రితం టైఫాయిడ్ వచ్చింది. ఆమె హిమోగ్లోబిన్ స్థాయి 4 g/dlకి పడిపోయింది, దాంతో బలహీనంగా ఉంది. కానీ కుటుంబసభ్యులు శ్రద్ధతో ఆమెకు ఆహారం అందించేవారు. ఆరోగ్యం కుదుట పడడంతో సంజన ఇంటి పనులు కూడా చేసేదని ఎంక్వైరీలో కుటుంబసభ్యులు వివరించారు. ఈ మధ్య కాలంలో యువతలో గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. “గుజరాత్‌లో గత ఆరు నెలల్లో మొత్తం 1,052 మంది గుండెపోటుతో మరణించారు, మరణించిన వారిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయస్కులు కావడం మరింత ఆందోళన కలిగించే అంశం.

” ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లోని కార్డియాలజీ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ కహలే మాట్లాడుతూ, “ఈ కార్డియాక్ సంఘటనలు కొన్నిసార్లు కార్డియోమయోపతిస్ లేదా గుండె ధమనుల యొక్క అసాధారణ మూలాల వంటి పరిస్థితులతో ముడిపడి ఉండవచ్చు, ఇక్కడ ధమనులు అనుచితంగా ఉంచబడతాయి మరియు కుదించబడతాయి. సరైన జీవన శైలిని అలవరచుకోవడం, శరీరానికి వ్యాయామం, వేళకు నిద్ర, సమయానికి ఆహారం యువతో గుండె సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker