ఎత్తు ఎక్కువగా ఉన్న వారికి వచ్చే జబ్బులు ఇవే, వాటిలో ముఖ్యంగా..?

ఓ పరిశోధన ప్రకారం, తక్కువ ఎత్తులో ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని తేలింది. అలాగే ఎక్కువ ఎత్తులో ఉండేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు హైట్ తక్కువ ఉన్న వారితో పోల్చితే కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుందంట. అయితే ఒక మనిషి ఎత్తు వారికి వచ్చే వ్యాధులకు మధ్య సంబంధాన్ని కనుక్కునేందుకు ఎన్నో అధ్యయనాలు జరిగాయి. వాటిలో ఎత్తు ఎక్కువగా ఉండే వ్యక్తులకు కొన్ని రకాల రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ అని తేలింది. పొడవుగా ఉన్న వారిలో గుండె జబ్బులు త్వరగా వస్తాయి.
అలాగే అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఎత్తు ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి జబ్బులు బారిన పడడానికి కారణం ఏంటో మాత్రం పరిశోధనలు చెప్పలేకపోతున్నాయి. ఆ వ్యక్తి ఎత్తు వారసత్వం అంటే జన్యుపరంగా వచ్చేది కాబట్టి, జన్యు విశ్లేషణను చేసి శోధించాల్సి ఉంటుంది. పొడవుగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టడం వంటివి కూడా వచ్చే ముప్పు అధికంగానే ఉంటుంది.
అలాగే హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తాయి. కాళ్లు, చేతుల్లో నాడులు త్వరగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పొడవుగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో అధ్యయనాల్లో ఎత్తు ఎక్కువగా ఉన్నవారికి వందకు పైగా రోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది. ఈ పరిశోధనను దాదాపు రెండున్నర లక్షల మంది పై చేశారు. మగవారిలో ఎత్తు 5.9 అడుగులు దాటితే వారు పొడవుగా ఉన్న వారి జాబితాలోకి వస్తారు.
వీరికి రక్తం గడ్డ కట్టడం, చర్మ ఇన్ఫెక్షన్లు, ఎముక ఇన్ఫెక్షన్లు కూడా వస్తున్నట్లు చేస్తున్నాయి. ఇక మహిళల విషయానికొస్తే 5.3 అడుగుల కన్నా ఎక్కువ ఉన్నవారు అధిక ఎత్తు ఉన్న స్త్రీల జాబితాలోకి వస్తారు. వీరికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక పొట్టిగా ఉన్నవారు తమకెలాంటి రోగాలు రావని అనుకుంటే అది పొరపాటే. పొడవుగా ఉన్న వారితో పోలిస్తే పొట్టిగా ఉండే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఎత్తుగా ఉన్న పొట్టిగా ఉన్నా కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎత్తు పెరుగుదల అనేది జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అలాగే చిన్నప్పుడు చేసే వ్యాయామం, ఆహారం కూడా ఎత్తును పెంచుతుంది. చేపలు, టోఫు, నట్స్, సీడ్స్, బీన్స్, పాలు వంటివి ఎత్తును పెంచేందుకు సహకరిస్తాయి. వీటిని తినడం వల్ల పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. పోషకాహార లోపం రాకుండా ఇవన్నీ అడ్డుకుంటాయి.