News

ఇండస్ట్రీలో అవకాశాలు లేక.. చివరకు చర్చిలో పాస్టర్‌గా చేస్తున్న తెలుగు హీరో.

రాజా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. దానికి కారణం తనకు బ్యాగ్రౌండ్ లేకపోవడమే అంటున్నాడు ఈ హీరో. ఇక్కడ ఏదైనా జరిగితే వెనక నిలబడటానికి అండ ఉండాలని.. లేకపోతే నిలబడటమే కష్టం అంటున్నాడు రాజా. అయితే రెండు దశాబ్ధాల క్రితం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాగే అడుగుపెట్టాడో యువ నటుడు. వచ్చిన కొత్తలోనే తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. చూడటానికి కూల్ గా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఓ చినదాన అనే సినిమాలో హీరో శ్రీకాంత్ పక్కన మరో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకి ఫస్ట్ హిట్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా యూత్ కూడా తెగ ఇష్టపడే విధంగా ఆనంద్ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడా నటుడు. చూడటానికి చాలా సాదాసీదాగా ఉండే ఈ యంగ్ హీరో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దశాబ్ధకాలం పాటు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా 30 సినిమాల్లో నటించాడు. చివరగా 2013లో ఓ మై లవ్ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఉండకూడదని డిసైడ్ అయ్యాడు.

ఎంతో మంచి నటుడిగా, చూడటానికి మన ఇంటి పక్కన ఉండే కుర్రాడిలా కనిపించే ఆ నటుడే రాజా హెబెల్. ఆనంద్ సినిమాలోతో పాటు ఆ నలుగురు, మహేష్ బాబు అర్జున్ సినిమాలో కూడా నటించాడు రాజా. అయితే నటుడిగా బాగా గుర్తింపు వచ్చి..చేతి నిండా అవకాశాలు ఉన్న సమయంలో రాజా హెబెల్ నటనకు గుడ్ బై చెప్పాడు. సినిమా రంగం నుంచి బయటకు వచ్చిన రాజా ఆ తర్వాత చర్చిలో పాస్టర్‌గా మారిపోయాడు.

ప్రస్తుతం ముషిరాబాద్ లోని ద న్యూ కెవినెన్ట్ చర్చ్ లో భక్తులకు దైవ ప్రవచనాలు చెబుతున్నాడు స్టార్ హీరో. దైవజనుడి అవతారమెత్తిన రాజా హెబెల్ అసలు పేరు కృష్ణమూర్తి. స్వతహాగా బ్రాహ్మణ సమాజిక వర్గానికి చెందిన రాజా తల్లి చిన్నప్పుడే చనిపోవడం..ఊహ తెలిసిన తర్వాత తండ్రి దూరమవడంతో క్రిష్టియన్‌గా మారారు. అప్పటి వరకు కృష్ణమూర్తిగా ఉన్న తన పేరును రాజా హెబెల్ మార్చుకున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker