News

షూటింగ్ లో హీరో విక్రమ్ కు విరిగిన పక్కటెముక, వైధ్యులు ఏం చెప్పారంటే..?

విక్రమ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పాన్ ఇండియా లేవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం తెరకెక్కిస్తున్న ఒక యాక్షన్ ని సీక్వెన్స్ లోనే విక్రమ్ కి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అయితే తమిళ్ స్టార్ హీరో ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించారు. పొన్నియిన్ తర్వాత విక్రమ్ తంగలాన్ సినిమాతో రాబోతున్నాడు.

పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కొన్ని ఏళ్ళ క్రితం ఉన్న కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా చియాన్ విక్రమ్ కు తంగలాన్ సినిమా సెట్ లో ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇన్ని రోజులు పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో ఉన్న విక్రమ్ నిన్ననే తంగలాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

చెన్నైలోని ఈపీవి ఫిలిం సిటీలో తంగలాన్ షూటింగ్ జరుగుతుంది. నేడు ఉదయం కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగి విక్రమ్ కు పక్కటెముక విరిగింది. వెంటనే చిత్రయూనిట్ విక్రమ్ ను హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని తెలిపినట్లు విక్రమ్ మేనేజర్, చిత్రయూనిట్ మీడియాకు తెలిపారు. విక్రమ్ కు ప్రమాదం జరగడంతో ప్రస్తుతం షూటింగ్ ఆపేశారు. విక్రమ్ కోలుకున్నాకే మళ్ళీ షూటింగ్ మొదలవుతుంది. గతంలో కూడా ఇదే సినిమా సెట్ లో విక్రమ్ కు ప్రమాదం జరిగి కొన్ని రోజులు షూటింగ్ ఆగింది.

దీంతో విక్రమ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విక్రమ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి విక్రమ్ కు హాస్పిటల్ లో చికిత్స ప్రారంభించినట్లు సమాచారం. ఇటీవల విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో విక్రమ్ ఎలా చేంజ్ ఓవర్ అయ్యాడు, ఎలా మేకప్ వేసుకున్నాడు. తన పాత్ర కోసం ఎలా రెడీ అయ్యాడో చూపించారు. విక్రమ్ తో పాటు అతని చుట్టూ పక్కల ఉన్నవాళ్ళని కూడా చూపించారు.

అలాగే షూటింగ్ ని అడవుల్లో, నీళ్ళల్లో, రాళ్ళల్లో ఎలా తీస్తున్నారు, యుద్ధ సన్నివేశాలను ఎలా తీశారో చూపించారు. ఈ వీడియోలో విక్రమ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది అయితే మేకింగ్ వీడియోనే విక్రమ్ లుక్ తో భయపెడుతుంటే ఇక సినిమాలో నటనతో ఏ రేంజ్ లో భయపెడతాడో అని కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమా కోసం, సినిమాలోని పాత్ర కోసం 57 ఏళ్ళ వయసులో కూడా విక్రమ్ ఈ రేంజ్ లో కష్టపడుతున్నాడంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ విక్రమ్ ని అభినందిస్తున్నారు. ఇపుడు ఇలా షూటింగ్ లో గాయం అవ్వడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker