News

హీరోయిన్ రంభ కూతురును చూశారా..! తల్లిని మించిన అందగత్తే..?

హీరోయిన్ రంభ..దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 1992లో మలయాళ చిత్రం సర్గంతో కెరీర్ ప్రారంభించిన విజయలక్ష్మి తెలుగులో అక్కడి అడక్కు చిత్రంలో ‘రంభ’ పాత్ర ద్వారా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఆ పేరు పెట్టారు. రంభ సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా కనిపిస్తోంది. అనేక కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే తెలుగులో రంభ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.

అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రంభ. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించారు రంభ. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇప్పటికి కూడా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు రంభ. పిల్లి తర్వాత రంభ సినిమాలకు దూరం అయ్యింది.

ఈ అందాల భామ మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు. ఇదిలా ఉంటే రంభ కూతురి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంభ కూతురు చాలా అందంగా ఉంది. అచ్చం తల్లిలానే ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే రంభ కూతురికి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో రంభ కూతురు చాలా చక్కగా మాట్లాడుతూ కనిపించింది. అయితే అందంతోనే కాదు వాయిస్ లోనూ ఈ చిన్నది తల్లిపోలికే. ఆమె మాట్లాడుతుంటే అచ్చం రంభ మాట్లాడినట్టే ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker