Health

గుడ్ న్యూస్, ఎయిడ్స్‌కు చికిత్స ఉంది, ఆ సర్జరీ చేస్తే ఎయిడ్స్‌ పూర్తిగా తగ్గిపోతుంది.

శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు. అయితే హెచ్‌ఐవీతో బాధపడుతోన్న ఓ రోగికి వైద్యులు ‘జెనీవా పేషెంట్’గా నామకరణం చేసి కొన్ని చికిత్సలు చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్‌‌ప్లాంట్ సర్జరీ తర్వాత కొద్ది రోజులు అతడిని అబ్జర్వ్ చేశారు. చిత్రం ఏమిటంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడిలో అస్సలు హెచ్ఐవీ ఛాయలే కనిపించలేదు. అన్ని ఫలితాలు నెగిటివ్ వచ్చాయి.

దీంతో వైద్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు ఆ రోగి హ్యపీగా జీవితం గడుపుతున్నాడు. ఈ పేషెంట్ 1990లో నుంచి ఎయిడ్స్‌తో పోరాడుతున్నాడు. హెచ్ఐవీ విషయంలో చాలా పురోగతి సాధించినట్టే అనుకోవాలి. చాలామంది హెచ్ఐవీ పాజిటివ్ పేషెంట్ల జీవన నాణ్యత మాత్రమే కాదు.. జీవిత కాలం కూడా పెరిగింది. అంతేకాదు వైరస్ సాంద్రత కూడా శరీరంలో గుర్తించలేనంత తక్కువ స్థాయికి చేరుకుంటోంది కూడా. ఈ పరిస్థితి వారి నుంచి వ్యాధి సంక్రమించే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇదివరకే ఐదురుగురు హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు.

లుకేమియా వంటి ప్రాణాంతక స్థితిలో ఉన్న పేషెంట్లకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స చేస్తారు. ఈ చికిత్స వల్ల దాత నుంచి వచ్చిన CCR5 జీన్ మ్యూటేషన్ వల్ల హెచ్ఐవీ శరీర కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నట్టు కనుగొన్నారు. 2018లో జేనీవా పేషెంట్.. తీవ్రమైన లుకేమియా సమస్యతో బాధపడ్డాడు. దీంతో స్టెమ్ సెల్ మార్పిడి చికిత్స తీసుకున్నాడు. అదే అతడిలో హెచ్‌ఐవీ నివారణకు కారణమైంది. ఇదివరకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స తీసుకున్నవారిలో కూడా CCR5 మ్యూటేషన్ వల్ల హెచ్ఐవి నయమైంది. ఇప్పటివరకు ఈ చికిత్స తీసుకున్న ఐదుగురు రోగులు హెచ్ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఫ్రెంచ్, స్విస్ పరిశోధకులు ప్రకటించారు.

అయితే ఈ ప్రకటనలో వైరస్ ఇప్పటికీ రోగి శరీర కణాల్లోకి ప్రవేశించగలదు. కాబట్టి వారు మందులు వాడుతూనే ఉన్నారు. జనీవా యూనివర్సిటీ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న ఈ ఆరో పేషెంట్ మాత్రం CCR5జన్యు మ్యూటేషన్ తో సంబంధం లేకుండానే కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్స తర్వాత అతడు 20 నెలల పాటు హెచ్ఐవి చికిత్సకు సంబంధించిన మందులు మానేసినప్పటికీ అతడిలో హెచ్ఐవి ట్రేస్ కనిపించలేదని అక్కడి నిపుణులు ప్రకటించారు.

కానీ తిరిగి అతడి శరీరంలో వైరస్ కనిపించదని చెప్పేందుకు ఎలాంటి రుజువులు కనిపించలేదనే హెచ్చరిక అలాగే ఉంది. ప్రస్తుతానికి అతడిలో హెచ్ఐవీ వైరస్ ట్రెసెస్ కనిపించడం లేదనేది నిజం. 5 సంవత్సరాల్లో వైరస్ తిరిగి రాకపోతే మాత్రమే పూర్తిగా నయమయినట్టు భావించాల్సి ఉంటుంది. అయితే 12 నెలల్లో వైరస్ గుర్తులేవీ కనిపించకపోతే.. హెచ్ఐవీ నుంచి పూర్తిగా భయటపడినట్లే. కానీ ఒకేఒక్క హెచ్ఐవీ కణం మిగిలిపోయినా వ్యాధి తిరిగి పుంజుకునే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఇప్పటి వరకు హెచ్ఐవి నుంచి పూర్తిస్థాయిలో విముక్తి పొందిన అందరూ క్యాన్సర్ పేషెంట్లు కావడం విశేషం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker