ఇంట్లో వారంతా స్నానానికి ఒకే సబ్బు వాడుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే..?
ఈ మధ్య సబ్బుకు బదులుగా చాలా మంది బాడీ వాష్ లిక్విడ్ లు వాడుతున్నారు. కానీ గ్రామాల్లో చాలా మంది సబ్బులను వాడుతారు. ఇక ఇంట్లోని వారంతా కూడా దాదాపుగా ఒకే సబ్బు ఉపయోగించడం అలవాటుగా మారింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో సబ్బుకు బదులుగా చాలా బాడీ వాష్ లిక్విడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
అయితే కొన్ని ఇళ్లలో ముఖ్యంగా గ్రామాల్లో ఇంటి సభ్యులందరికీ ఒకే సబ్బును ఉపయోగించడం అలవాటు. అయితే ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడటం ఎంతవరకు సురక్షితం. ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన 2006 అధ్యయనంలో స్నానానికి ఉపయోగించే సబ్బులో రెండు నుంచి ఐదు రకాల సూక్ష్మజీవులు ఉన్నాయని కనుగొన్నారు.
అదనంగా అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లో 2015 అధ్యయనంలో దాదాపు 62 శాతం బార్ సబ్బులు కలుషితమై ఉన్నాయని కనుగొన్నారు. సబ్బుపై ఉండే బాక్టీరియా ఒకే సబ్బును ఉపయోగించి వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..
సబ్బులో సాల్మొనెల్లా, షిగెల్లా బాక్టీరియా వంటి జెర్మ్స్, అలాగే నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరస్లు ఉంటాయి. కొన్ని చర్మంపై కోతలు లేదా గీతల ద్వారా వ్యాప్తి చెందుతాయి.
మరికొన్ని మలం ద్వారా వ్యాపిస్తాయి. అందుకే ఒకే ఒక్క సబ్బును ఉపయోగించడం సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.