News

మీ ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసుకోండి, లేదంటే.. ఐటీ వాళ్లు జప్తు చేస్తారు.

మన దగ్గరుందికదా అని ఎంతంటే అంత ఇండ్లల్లో పెట్టుకోవడం కుదరదంటోంది ఐటీ శాఖ. నిజానికి ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిమితుల్నీ విధించలేదు. కానీ ఐటీ శాఖ అధికారులు జరుపుతున్న సోదాల్లో పట్టుబడుతున్న పుత్తడిపై ఆదాయ పన్ను చెల్లింపుదారులకు, ఆదాయ పన్ను శాఖకు మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే బంగారం విలువైన లోహం. చాలా మంది బంగారాన్ని ఆభరణాలుగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో, ధన్‌తేరస్ సందర్భంగా లేదా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తారు. అంతే కాకుండా.. చాలా మంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా చూస్తారు.

ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పెరుగుతోంది. బంగారం ధరలు పెరుగుతన్నా కానీ.. అవసరం అయిన సందర్భంలో కచ్చితంగా జనాలు కొనుగోలు చేస్తున్నారు. నగలు, ఆభరణాలే కాకుండా చాలా మంది తమ ఇళ్లలో బంగారు నాణేలను కూడా ఉంచుకుంటారు. మనలో చాలా మంది ఇళ్లలో బంగారం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మన ఇళ్లలో మనం ఎంత బంగారం ఉంచగలం అనే ప్రశ్న తలెత్తుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం.. వ్యవసాయ, గృహ పొదుపులు లేదా చట్టబద్ధంగా సంక్రమించిన బంగారం వంటివి ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చేది కాదు.

మీ ఇంట్లో నిర్ణీత పరిమాణంలో బంగారం ఉంటే ఏ అధికారి ఇంట్లోని బంగారాన్ని స్వాధీనం చేసుకోలేరు. పెళ్లైన మహిళలకు 500 గ్రాముల బంగారం.. అంటే 50 తులాల వరకు ఇంట్లో ఉంచుకోవచ్చు. పెళ్లికాని స్త్రీ 250 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు.. అంటే 25 తులాలు. పురుషులు తమ వద్ద 100 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. నిబంధనల ప్రకారం.. ఇంత పరిమాణంలో మీ వద్ద నగల రూపంలో బంగారం ఉంటే.. 1994 సీబీడీటీ సర్క్యూలర్ ప్రకారం ఐటీ అధికారులు మీ జోలికి రారు. వీటి కంటే ఎక్కువగా ఉన్నా..

లేదంటే వారసత్వంగా మీకు ఆ నగలు వస్తున్నా.. వాటికి సంబంధించి సాక్ష్యాలు చూపిస్తే సరిపోతుంది. లేదంటే బంగారాన్ని జప్తు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడేళ్లలోపు బంగారం కొని అమ్మితే.. ఈ పరిస్థితిలో, దానిపై పొందిన ప్రయోజనాలు వ్యక్తి యొక్క ఆదాయానికి జోడించబడతాయి. దీనిపై పన్ను శ్లాబ్ కింద పన్ను విధిస్తారు. అయితే మీరు మీ బంగారాన్ని కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల తర్వాత అమ్మితే.. ఈ పరిస్థితిలో, మీరు సంపాదించే లాభం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker