ఇంట్లో శివుని విగ్రహం పెడుతున్నారా..? ఈ జాగ్రతలు ఖచ్చితంగా పాటించాలి, లేదంటే..?
చాలామంది ఇళ్లలో ఎక్కువగా శివుడు, వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు ఉంటాయి. హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమశివుడు ఒకరు. శంకరుడు, పరమేశ్వరుడు, భోళాశంకరుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడు ఇలా అనేక పేర్లతో కైలాసవాసుడిని కొలుస్తారు. ఎక్కువ మంది శివుడిని లింగం రూపంలోనే పూజలు చేస్తారు. కానీ శివుని విగ్రహాలు, చిత్రపటాలు పెట్టుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
అయితే ధ్యాన భంగిమలో ఉన్న శివుని విగ్రహం.. ఇంట్లో శివుని విగ్రహం పెట్టుకోవాలంటే.. కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. శివుని విగ్రహం ధ్యాన భంగిమలో ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి శివుని విగ్రహాన్ని పిల్లలు చదువుకునే గదిలో ఉంచవచ్చు. దీని వల్ల పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది.
అంతేకాదు వారు చదువులో మెరుగ్గా రాణిస్తుంటారు కూడా. శివ కుటుంబం చిత్రాన్ని ఉంచండి..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో శివుడి కుటుంబాన్ని ఉంచడం చాలా మంచిది అంటారు. దీంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఎన్నో లాభాలు కలుగుతాయట. కుటుంబంలో ప్రేమ, అవగాహన పెరుగుతుంది. అంతేకాదు పరమశివుడు కూడా సంతోషించి తన భక్తులపై ఆశీస్సులను అందిస్తాడు.
పొరపాటున కూడా ఈ విగ్రహాన్ని పెట్టవద్దు..కొన్ని దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టవద్దు అంటారు పండితులు. కొన్ని విగ్రహాల వలన జీవితంపై ప్రభావం చూపిస్తాయట. వాస్తు ప్రకారం, మహాదేవుడు తాండవం చేస్తున్నప్పుడు కోపంగా ఉన్న భంగిమలో ఉన్న పటం, బొమ్మ, విగ్రహం ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అలాంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఉద్రిక్త వాతావారణం ఏర్పడుతుందట.