చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేస్తున్నారా..? ఈ విషయాలు మీకు తెలిస్తే..!
చలికాలంలో తలస్నానం చేస్తే జుట్టు తడి ఆర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, పూర్తిగా డ్రై అయిన తర్వాత చిక్కు వదిలించుకోవాలి. తడి జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఊడి పోతుంది. లేదా డ్యామేజ్ అవుతుంది. తడి జుట్టును ఆత్రంగా దువ్వితే జుట్టు ఎక్కువగా రాలే అవకాశం ఉంది. అయితే మీరు మీ జుట్టును షాంపూ చేసి వేడి నీటిలో స్నానం చేస్తే, మీ జుట్టు బలహీనంగా, పెళుసుగా మారుతుంది. దీని వల్ల జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. అదే సమయంలో వేడి నీరు మీ హెయిర్ ఫోలికల్స్ అంటే జుట్టు మూలాలను తెరుస్తుంది.
దీని కారణంగా జుట్టు దాని మూలాల నుండి రాలడం ప్రారంభమవుతుంది. రెండవ ప్రతికూలత ఏమిటంటే.. వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల స్కాల్ప్ పొడిబారుతుంది. ఫలితంగా, మీరు దురద, చుండ్రుతో బాధపడవచ్చు. ఎందుకంటే, స్కాల్ప్ బాగా పొడిగా మారినప్పుడు, దానిపై చుండ్రు మొదలవుతుంది. చుండ్రు వల్ల నూనె లేదా దానిలోని పోషకాలు తలకు చేరవు. వేడి నీటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి హానికరం. మీరు చలిలో అనుభూతి చెందకపోవచ్చు, కానీ ఇది చర్మం చికాకు, వాపు, ఎరుపు మొదలైన వాటికి కారణమవుతుంది.
వేడి నీటితో తల స్నానం చేస్తే జుట్టు త్వరగా ఆరిపోతుంది. ఎందుకంటే వేడి నీళ్లలో ఉన్న సహజ నూనెలు తొలగిపోతాయి. జుట్టు, తల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. చలికాలంలో తలస్నానం చేయకూడదనుకుంటే, స్నానం చేయడం ఎలా అని మీరు అడగవచ్చు. ఈ సమయంలో చల్లటి నీళ్లతో స్నానం చేయడం అంత తేలికైన పని కాదు. నిజానికి జుట్టు నిపుణులు చల్లని నీటితో కూడా తల స్నానం చేయమని సిఫారసు చేయరు. వీటికి బదులు గోరువెచ్చని లేదా సాధారణ నీటిని వాడాలని చెబుతున్నారు.
బాగా వేడి నీటితో చలికాలంలో తలస్నానం చేయకూడదు. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. చర్మానికి కూడా ఇబ్బందులు కలిగిస్తుంది. సాధారణ నీటితో తలస్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టుపై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను చూస్తారు.
ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి. రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు ఎక్కువ అవుతాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.