News

హృతిక్‌ రోషన్‌కు తీవ్ర గాయాలు, ప్రస్తుతం నడవలేని స్థితిలో స్టార్ హీరో.

హృతిక్‌ రోషన్‌..మీలో ఎంత మందికి క్ర‌చెస్‌, వీల్ ఛైర్ అవ‌స‌ర‌మొచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి? అని పోస్ట్ చేశారు. త‌న‌ను తాను మోటివేట్ చేసుకుంటున్నాన‌ని, ఆ బాధ నుంచి కోలుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సినీ ప్ర‌ముఖులు టైగ‌ర్ ష‌రాఫ్, వ‌రుణ్ ధావ‌న్‌, వాణీ క‌పూర్ త‌దితులు, ఫ్యాన్స్‌. నెటిజ‌న్లు ఆయ‌న త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అయితే హృతిక్‌.. మీలో ఎంతమందికి క్రచ్‌లు, వీల్‌ చైర్‌పై ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కసారైనా మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా..

అప్పుడు మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించాడు. అంతేకాక ఈ సందర్భంగా తన తాతగారితో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు హృతీక్‌. ‘‘నాకు బాగా గుర్తుంది.. మా తాత ఎయిర్‌పోర్ట్‌లో వీల్‌ చైర్‌పై కూర్చోవడానికి ససేమీరా ఒప్పుకోలేదు. ఎందుకంటే అది తనను తాను బలహీనమైన వాడినని గుర్తు చేస్తుందట. అప్పుడు నేను ఆయనతో ఈ వీల్‌ చైర్‌ మీ గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది అని చెప్పాను. అప్పుడు ఆ విషయం మా తాతను చాలా బాధించింది’’ అని గుర్తు చేసుకున్నాడు. ‘‘ఇలా అన్నింటిని భరించడం, ధైర్యంగా ఉండటం సైనికుడి మనస్తత్వం.

మా నాన్న కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. కానీ సైనికులెప్పుడూ ఇలాంటి (వీల్‌ చైర్స్‌ను)వాటిని వాడేందుకు ఇష్టపడరు.. నిజమైన బలం అనేది ఇలా వీల్ చైర్స్, క్రచెస్‌ పట్టుకోవడంలో ఉండదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. మీ జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే.. అవసరమైతే ఇలాంటివి వాడండి.. త్వరగా కోలుకోండి.. వీల్‌చైర్‌, క్లచెస్‌ వాడటానికి మోహమాటపడకండి అంటూ సలహా ఇచ్చాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు తాను అదే పని చేస్తున్నట్లు ఇండైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు. అయితే తనకు ఈ గాయాలు ఎలా అయ్యాయి.. ప్రమాదం ఎప్పుడు జరిగింది.

ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం అనే విషయాల గురించి మాత్రం వెల్లడించలేదు. దాంతో కొందరు నెటిజనులు.. ఇది నిజమేనా.. లేక ఏదైనా ప్రాంకా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. హృతిక్‌ రోషన్‌ కొన్ని రోజుల క్రితమే ఫైటర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం హృతిక్‌ వార్ 2 కోసం రెడీ అవుతున్నాడు. ఈ సమయంలో ఇలా ప్రమాదానికి గురి కావడం చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker