ఈ విత్తనాలు మగవారికి, మహిళలకు గొప్ప వరం, ఎలా చేసి తినాలంటే..?

జనపనార విత్తనాలు..ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులకు చెక్ పెడుతుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. ఇది చక్కటి పోషకాహారం. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. గుండె పోటు, హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచటంతోపాటు జీర్ణసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ప్రోటీన్ పౌడర్‌కు బదులుగా జనపనార విత్తనాలను వినియోగించవచ్చు.
అయితే జనపనార విత్తనాలలో ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. జనపనార విత్తనాలు తీసుకోవడం వలన నెలసరి సమయానికి ముందు వచ్చే కడుపు నొప్పి, అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మెనోపాజ్‌లో వచ్చే ఇబ్బందులు కూడా తగ్గుతాయి. శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పీఎంఎస్, మెనోపాజ్ లక్షణాలు రెండూ ఉండే వాపులను నియంత్రించడంలో అవి సహాయపడతాయి.
జనపనార గింజలలోని ఒక నిర్దిష్ట యాసిడ్ అయిన గామా-లినోలెనిక్ యాసిడ్ (GLA) ప్రొక్లాటిన్‌ను తగ్గిస్తుందని నిరూపించబడింది. ఇది మహిళల నెలసరి కాలాల్లో సున్నితత్వాన్ని పెంచే హార్మోన్. జనపనార గింజలలో GLA అధికంగా ఉన్నందున అనేక అధ్యయనాలు రుతువిరతి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని సూచించాయి. కచ్చితమైన ప్రక్రియ తెలియదు కానీ జనపనార గింజలలోని GLA రుతువిరతితో సంబంధం ఉన్న హార్మోన్ అసమతుల్యత, వాపులను నియంత్రిస్తుంది.
జనపనార విత్తనాలు ఆన్‌లైన్ స్టోర్స్ లో, షాపులలో విరివిగా లభిస్తాయి. ఈ విత్తనాలను వేయించి పొడి చేసి కూరలలో వేసుకోవచ్చు. లేదా నానబెట్టి పేస్ట్ చేసి కూరలలో వేసుకుని తినవచ్చు. విత్తనాలను దోరగా వేయించి ఖర్జూరం, తేనె కలిపి లడ్డూలు చేసుకుని కూడా తినవచ్చు. వీటిని తినడం వల్ల ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమస్యలను తగ్గించుకోవడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
జనపనార గింజలలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక ఇవి లినోలెయిక్ యాసిడ్‌ను కూడా కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం కొలెస్ట్రాల్ స్థాయిలను 15 శాతం తగ్గించి రక్తపోటును తగ్గించడానికి పని చేస్తాయని తేలింది. కనుక వీటిని తరచూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.