Health

పిల్లలకు ఈ మూలిక తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరిగి చదువులో దూసుకెళ్తారు.

జటామాంసి..గుంప చేదు, తీపి, వగరు కలగలిసి ఉంటుంది. ఇది చలువచేసే గుణాన్ని కలిగివుంటుంది. దీనిని దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, భుజపుటెముక నొప్పి, తలనొప్పి, అజీర్తి, శూల, కడుపు ఉబ్బరం, కాలేయ, మూత్ర సంబంధ వ్యాధులకు, బహిష్టు నొప్పి, రక్తపోటు, తలనెరియడం, జుట్టురాలిపోవడం వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే అరుదైన మూలికలలో ఒకటి జటామాన్సి. దీనినే బల్చాద్ అని కూడా అంటారు. ఈ మూలికలో చర్మం, జుట్టు సమస్యలను తీర్చే అద్భుతమైన గుణం ఉంది.

అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా మెదడు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు జటామాన్సిని వాడితే ఎంతో మంచిది. జ్ఞాపకశక్తిని కూడా ఇది పెంచుతుంది. దీనిలో అడాప్టర్ జెనిక్ లక్షణాలు అధికం. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ప్రశాంతంగా ఉంచుతాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి జటామాన్సిని ఉపయోగించవచ్చు.

ఇది మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ సంకేతాలను పంపడానికి, నాడీ సంబంధిత కనెక్షన్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. విద్యార్థులు తరచూ ఈ మూలికను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో న్యూరో ప్రొటెక్టివ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి మెదడు దెబ్బతినకుండా, జ్ఞాపకశక్తి కోల్పోకుండా కాపాడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థం చేయడానికి సహాయపడతాయి.

జటామాన్సిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వృద్ధాప్యంలో కూడా మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతుంది. జటామాన్సి మెదడు కణాల నిర్మాణం, మరమ్మత్తు ప్రక్రియలను అద్భుతంగా నిర్వహిస్తుంది. కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల టెన్షన్లు తగ్గుతాయి. దీన్ని ప్రతిరోజూ వినియోగిస్తే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జటామాన్సి పొడి రూపంలో మార్కెట్లో సులువుగానే దొరుకుతుంది.

దీన్ని రాత్రిపూట పాలు లేదా నీటిలో కలుపుకొని తాగితే ఎంతో మంచిది. దీన్ని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిని గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అవి మరుగుతున్నప్పుడు ఒక స్పూను జటామాన్సి పొడి వేయాలి. ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఇది మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker