News

కోర్టు సంచలన తీర్పు, జయప్రద ఎక్కడున్నా వెంట‌నే అరెస్టు చేయండి.

జయప్రద 2019లో రాంపూర్ నుంచి బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమెపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయి. కానీ నిర్ణీత తేదీల్లో విచారణకు జయప్రద కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా ఒకదాని తర్వాత ఒకటి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.

అయినప్పటికీ జయప్రద కోర్టుకు రాలేదు. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ యూపీ రామ్‌పూర్ జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించిన నేరంపై ఆమెపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో జయప్రదను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

జయప్రద ఎక్కడ ఉన్నా ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయాలని, ఈ నెల 27వ తేదీన కోర్టులో హాజరు పరచాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ని కోర్టు ఆదేశించింది. టీడీపీలో ప్రారంభించిన ఆమె రాజకీయ జీవితం తర్వాత యూపీకి చేరింది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన జయప్రద తర్వాత ఉత్తరాదిలో తన సత్తా చాటుకున్నారు.

యూపీలోని సమాజ్ వాది పార్టీలో చేరి రాంపూర్ నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీలో చేరారు.. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఎంపీగా ఉన్న సమయంలో ఈఎస్ఐ కి సంబంధించిన కుంభకోణంలో కేసు నమోదైంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker