News

తన బిడ్డకి పాలివ్వడం కోసం పడ్డ కష్టాలు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న కాజల్ అగర్వాల్.

టాలీవుడ్‌ ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బాబుకు నీల్‌ కిచ్లూ అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కాజల్‌.. తన విలువైన సమయాన్ని కొడుకుతో గడుపుతోంది. అయితే అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సూపర్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. త్వరలో కాజల్ సోలో హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ చిత్రం మే 31న కానీ జూన్ 7న కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ రానుంది. కాజల్ మాత్రం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా అదే క్రేజ్ కొనసాగించడం ఒక ఛాలెంజ్ అయితే.. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం మరో ఛాలెంజ్. దేనిని నెగ్లెట్ చేసినా ఇబ్బందులు రావచ్చు. ఎంత కష్టమైన కాజల్ అటు వృత్తిని, ఇటు కుటుంబాన్ని సమానంగా చూసుకుంటోంది. ముఖ్యంగా తన కొడుకు జన్మించిన తర్వాత ఎంతగా కష్టపడిందో కాజల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి.

కాజల్ మాట్లాడుతూ ప్రెగ్నన్సీకి ముందు నేను కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాను. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కొన్ని యాడ్ షూట్స్ చేయాలి. కొందరు చాలా అర్జెంట్ కొన్ని గంటలు సమయం ఇస్తే షూటింగ్ పూర్తి చేస్తాం అని చెప్పారు. ఇది నా బిడ్డకి జన్మనిచ్చిన మొదటి వారంలోనే జరిగింది. నా బాడీ కూడా అంతగా సహకరించడం లేదు. బిడ్డని వదిలిపెట్టి బయటకి రాలేను. మీరే మాయా ఇంటికి వచ్చి షూట్ చేయండి అని చెప్పా. వాళ్ళు సహకరించారు. అది కొవిడ్ టైం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఆ తర్వాత కొడుకు పుట్టాక రెండు నెలలకి శంకర్, కమల్ హాసన్ ఇండియన్ 2లో నటించాల్సి వచ్చింది.

శంకర్ సర్ నా కోసం వీలైనంత ఎక్కువ సమయం షూటింగ్ పోస్ట్ పోన్ చేశారు. ఆయనకి రుణపడి ఉంటాను. ఈ చిత్రం కోసం నేను కళరీ విద్య కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇండియన్ 2 షూటింగ్ కడప పరిసర ప్రాంతాల్లో జరిగింది. తిరుపతి నుంచి 2 గంటలు జర్నీ. నా కొడుకుకి నేను పలు ఇవ్వాలి కదా. అందుకే మా అమ్మని, కొడుకుని తిరుపతిలో ఉంచా. షూటింగ్ లొకేషన్ లో క్యారవ్యాన్ లోకి వెళ్లి బాటిల్ లో పాలు నింపేదాన్ని. పాలు పాడవకుండా ఐస్ లో పెట్టి కారులో మా డ్రైవర్ చేత తిరుపతికి పంపేదాన్ని. రోజుకి రెండు సార్లు ఇలా చేయాల్సి వచ్చేది. అంటే డ్రైవర్ 8 గంటలు డ్రైవ్ చేస్తూనే ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker