కమల్ హాసన్ ఎత్తుకున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్. ఎవరో చెప్పుకోండి..?
శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించారు. ఈమె ప్రముఖ నటుడైన కమల్ హాసన్ కూతురు. తల్లిదండ్రులు ఇద్దరు నటులు కావడంచేత నటనపె ఆసక్తి పెంచుకుంది. ఈమె 1986 జనవరి 28 చెన్నై, తమిళనాడులొ జన్మించారు. అయితే శ్రుతి హాసన్ సినీ జీవితం మెదట పరాజయాలు పలకరించినప్పటికి త్రి, గబ్బర్ సింగ్ సినిమాలు మంచి నటిగా గుర్తింపునిచ్చాయి.పవన్ కళ్యాణ్ సరసన “గబ్బర్ సింగ్” సినిమాలో నటించింది.
ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతి హాసన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. తన తల్లిదండ్రులతో కలిసి చిరున్వులు చిందిస్తూ కనిపిస్తుంది శ్రుతిహాసన్. సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్.. ఆ తర్వాత కథానాయికగానూ నిరూపించుకుంది.
తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి హిట్స్ అందుకుంది. 2009లో విడుదలైన లక్ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. సినిమాల్లో కథానాయికగా నటించడమే కాకుండా పాటలు పాడడం, కంపోజ్ చేయడం, సాంగ్స్ రాయడం ఇలా అన్నింటిలోనూ ప్రతిభ ఉన్న నటి.
ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది శ్రుతిహాసన్. అలాగే సలార్ 2లోనూ నటిస్తుంది. ఇవే కాకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి ఇనిమీల్ ఆల్బమ్ చేసింది. ఇదిలా ఉంటే గత నాలుగేళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉంది శ్రుతిహాసన్. కానీ ఇటీవలే వీరిద్దరి విడిపోయారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ వీటిపై స్పష్టత రావాల్సి ఉంది.