Health

ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గులకు ఈ ఆకూ కషాయం తాగితే ఒక్కరోజులో తగ్గిపోతుంది.

ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు. సిటీల‌లో ఉండేవాళ్ల‌కు తిప్పతీగ‌ గురించి తెలియ‌క‌పోయినా.. ప‌ల్లె జనాల‌కు మాత్రం నిత్యం క‌నిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది.రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పెద్ద‌లు చెబుతారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి అవగాహన లేదు. దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. అయితే వర్షాకాలంలో చాలా మందిని వేధించే సాధారణ ఆరోగ్య సమస్య జలుబు, దగ్గు.

ఈ సమస్యను ఈ మూలికలతో పరిష్కరించవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్య ఎక్కువగా స్కూల్‌ పిల్లల్లో కనిపిస్తుంది. చలి వాతావరణం వల్ల లేదా వర్షంలో తడవడం వల్ల పిల్లల్లో ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ, పిల్లలకు జలుబు, దగ్గు ఉంటే ఎక్కువగా యాంటీబయాటిక్ ఇవ్వకూడదు. బదులుగా, దగ్గు తగ్గించడానికి కషాయాలను, ఇంటి నివారణలను ఉపయోగించడం మంచిది. తిప్ప తీగ దీనినే అమృతవల్లి అని కూడా అంటారు.. అమృతవల్లితో చేసిన ఈ కషాయం ఇంకా మంచిది. అమృతవల్లి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది రుమాటిజం సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. మొత్తానికి ఈ అమృత తీగ శరీరానికి వరం లాంటిది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తిప్పతీగ కషాయం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. మరి ఈ అమృత తీగ కషాయం ఎలా చేయాలో తెలుసుకుందాం.

కషాయాలకు కావలసిన పదార్థాలు.. 3-4 ఎండు తిప్పితీగ ఆకులు, 2 బగరా ఆకులు, 5-6 తులసి ఆకులు, 1 tsp జీలకర్ర విత్తనాలు, గ్రౌండ్ మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, తేనె నెయ్యి. కాషాయం తయారుచేసే విధానం..రెండు కప్పుల నీటిని బాగా మరిగించి, ఆపై పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి త్రాగాలి. ఈ అమృతాన్ని మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తుంది.

కానీ, అతిగా తీసుకోకూడదు. అమృత తీగలే కాదు ఏ మందు అయినా అతిగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఖాయం. అమృత తీగ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం.. మృత తీగను తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. బదులుగా, రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. మందు తీసుకోకుండా ఈ తీగను సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker