News

సినీ పరిశ్రమలో మరో విషాదం, గుండెపోటుతో ఆస్పత్రిలో ప్రముఖ నటి కన్నుమూత.

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నటి కవితా చౌదరి అమృత్ సర్ లో గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1989-1991 మధ్యకాలంలో దూరదర్శన్‌ ప్రసారమైన మహిళా సాధికారత ప్రోగ్రెసివ్ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారి కళ్యాణి సింగ్ పాత్రలో కవితా చౌదరి బాగా పాపులర్‌ అయ్యారు.

ఆమె ఈ సీరియల్‌లో నటించడమేకాకుండా తన సొంత అక్క పోలీస్‌ అధికారి కంచన్‌ చౌదరి భట్టాచార్య జీవితం నుంచి ప్రేరణ పొంది, స్వయంగా కథరాసి దర్శకత్వం వహించారు. ఈ సీరియల్‌లో శేఖర్‌ కపూర్‌ కూడా నటించారు. ఐపీఎస్ అధికారి కావాలనుకునే మహిళ పోరాటం చుట్టూ ఉడాన్ సీరియల్‌ కథ తిరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సీరియల్‌ కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ను తిరిగి ప్రసారం చేశారు.

ఆ తర్వాత కవితా చౌదరి దూరదర్శన్‌లో యువర్ హానర్, IPS డైరీస్‌ షోలను కూడా నిర్మించారు. అంతేకాకుండా తొలినాళ్లలో సర్ఫ్‌ యాడ్స్‌లోనూ ఆమె నటించారు. కవిత నటించిన ఉడాన్‌ సీరియల్‌ రాజకీయ నేత స్మృతి ఇరానీపై కూడా ప్రభావం చూపింది . ఆమె షో రీ-రన్ గురించిన వార్తలను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. ‘కొందరికి ఇది కేవలం సీరియల్ మాత్రమే. నేను అధిగమించడం అసాధ్యంగా భావించే పరిస్థితుల నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి ఇది ఒక పిలుపు’ అని పేర్కొన్నారు.

కాగా నటి కవిత భారతీయ టెలివిజన్‌లో చెరగని ముద్ర వేశారని చెప్పవచ్చు. నటన పట్ల ఆమెకున్న అంకితభావం, భావోద్వేగాలను రేకెత్తించే సామర్థ్యం ప్రేక్షకులకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker