Health

టామాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయా..? అసలు నిజమేంటంటే..?

చాలా మంది మాంసాహారాలతోనే అధిక శక్తి వస్తుందని అనుకుంటారు. కానీ కొన్ని కూరగాయల్లో ఉండే ప్రోటీన్లు, పోషకాల గురించి తెలిస్తే వాటిని విడిచిపెట్టరు. కూరగాయల్లో అన్నికాలాల్లో లభించేవి కొన్ని ఉంటాయి. వీటిలో టామాటాలు ముఖ్యమైనవి. వీటితో కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందువల్ల కొందరు ఎక్కువ శాతం టామాట కర్రీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కేవలం టామాటాలే కాకుండా వీటిలో పప్పు, చిక్కుడు ఇతర పదార్థాలు వేసి కాంబినేషన్ కర్రీ చేసుకుంటారు.

అయితే టామాటాలు ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయని కొందరి భావన. కిడ్నీలు శరీరంలోని రక్తాన్ని వడబోస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా శుద్ధి అయిన రక్తం ఇతర అవయవాల్లోకి వెళ్తుంది. మలినాలను మూత్రాశయం ద్వారా బయటకు పంపుతాయి కిడ్నీలు. అయితే ఈ క్రమంలోనే ఆహారంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని మలినాలు ఏర్పడి స్పటికంలా తయారవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి పెద్దగా అయి మూత్రాశయం ద్వారా బయటకు వెళ్లకుండా ఆగిపోతాయి.

దీంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో టమాటాల ప్రమేయం లేదు. వాస్తవానికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. మన శరీరతత్వాన్ని బట్టి కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. కానీ కేవలం టామాటాలు తినడం వల్లనే కిడ్నీలు ఏర్పడుతాయనేది చెప్పలేమని కొందరు నిపుణులు అంటున్నారు. కానీ కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారు మాత్రం పాలకూర, టామాటాలకు దూరంగా ఉండాలి.

ఇవి తినడం వల్ల కిడ్నీల్లోని రాళ్లపై ప్రభావం పడుతుంది. అంతేగానీ.. కిడ్నీల్లో ఎటువంటి సమస్య లేని వారు హాయిగా టమాటాలను తినొచ్చు. టామాటాలు తినడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్య రాదు. అంతేకాకుండా ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టమాటాను కేవలం కర్రీగానే కాకుండా రకరకాల డిషేష్ తయారీలో ఉపయోగిస్తారు. ఫిజాహాట్‌లో టమాటాలను ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల టమాటాల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker