ముద్దుతో బీపీ, షుగర్ కూడా తగ్గుతుంది తెలుసా..? లాలాజలం ద్వారా కూడా..?
మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పుల చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌లు బారిన పడేవారు చాలా మందే ఉన్నారు. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. అయితే మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది.
జీవన విధానంలో మార్పుల చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌లు బారిన పడేవారు చాలా మందే ఉన్నారు. బీపీని తగ్గించే ముద్దు బీపీని తగ్గించే ముద్దు అని చదవగానే ముద్దుకు కూడా బీపీని తగ్గిస్తుందా అనుకుంటున్నారా..? డయాబెటిస్‌ని తగ్గించే ముద్దు కూడా ఉంది తెలుసా..? ముద్దు పెట్టుకోవడం వల్ల బీపీ తగ్గి నార్మల్ అవుతుంది అని.
ముద్దు పెట్టుకునే క్రమంలో మనిషి శరీరంలో రక్తనాళాలు వెడల్పుగా తయారవుతాయి. దీంతో రక్త ప్రసరణ సులువు అవుతుంది. నొప్పి నివారిణి..ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి మనిషికి అలసటను దూరం చేసి హాయిని ఇవ్వడమే కాకుండా నొప్పి నివారిణిగానూ పనిచేస్తాయట. అంతేకాకుండా రక్త ప్రసరణ నార్మల్ అవడం వల్ల శరీరంలో తిమ్మిర్లు, తలనొప్పి వంటి సమస్యలు నుంచి కూడా రిలాక్సేషన్ పొందవచ్చు.
పుప్పి పళ్లు రాకుండా చేసే ముద్దు..మీరు మీ పార్ట్‌నర్‌ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీ నోట్లో లాలాజలం విడుదల అవుతుంది. అలా విడుదలయ్యే లాలాజలం దంతాల మధ్య పేరుకుపోయిన పాచిని తొలగించి పుప్పి పళ్లు రాకుండా చేస్తుందట. హ్యాపీ హార్మోన్స్ విడుదల..ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్, ఆక్సీటోసిన్ అనే హ్యాపీ హార్మోన్స్‌ని విడుదల చేస్తాయి. ఇవి మనిషిని సంతోషంగా ఉంచడానికి సహాయం చేస్తాయి.
ముద్దు పెట్టుకునేటప్పుడు పెరిగే హార్ట్ రేట్, మజిల్ యాక్టివిటీ వల్ల ఒంట్లో కొన్ని కేలరీలు ఖర్చు అవుతాయి. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. ముద్దుతో పెరిగే ఆత్మవిశ్వాసం..ముద్దు పెట్టుకునే క్రమంలో కలిగే చనువుతో ఇద్దరి మధ్య బంధం మరింత ధృడపడుతుంది. ఇది మీ పట్ల, మీ బంధం పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సెక్స్ అంటే రొమాన్స్ వల్లే మీరు మీ లైఫ్ పార్ట్నర్‌కు బాగా దగ్గరవుతారు.